'జైలుకైనా వెళ్తాం కానీ రూపాయి కూడా చెల్లించం'

10 Mar, 2016 13:55 IST|Sakshi

ఢిల్లీ: ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనం నిర్వహణ కోసం యమునా నదీ పరిసర ప్రాంతాల్లో పర్యావవరణానికి హాని కలిగించారన్న కారణంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్.. శ్రీశ్రీ రవిశంకర్ నేతృత్వంలోని 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' సంస్థకు 5 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. కార్యక్రమ ప్రారంభానికి ముందుగానే ఈ జరిమానాను డిపాజిట్ చేయాలని గ్రీన్ ట్రీబ్యునల్ ఆదేశాలలో పేర్కొంది. అయితే దీనిపై శ్రీశ్రీ రవిశంకర్ గురువారం జాతీయ మీడియాతో మాట్లాడుతూ అవసరమైతే జైలుకైనా వెళ్తాం కానీ ఒక్క రూపాయి కూడా చెల్లించబోం అని స్పష్టం చేశారు.

యమునా నదీ పరిసరాల్లో చేసిన ఏర్పాట్లన్ని తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేసినవే అని, కార్యక్రమం ముగిసిన అనంతరం వాటిని తొలగిస్తామని ఆయన వెల్లడించారు. ప్రపంచ సాస్కృతిక సమ్మేళనం ప్రైవేటు కార్యక్రమం కాదని, లక్షలాది మంది హాజరౌతున్న ఈ కార్యక్రమాన్ని వ్యక్తిగత కార్యక్రమంగా చూడొద్దని శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు.
 

మరిన్ని వార్తలు