ఎయిమ్స్ వైద్యుడికి థరూర్ ఈ-మెయిల్స్!

16 Jan, 2015 09:11 IST|Sakshi
ఎయిమ్స్ వైద్యుడికి థరూర్ ఈ-మెయిల్స్!

న్యూఢిల్లీ : సునంద పుష్కర్ మృతి కేసులో ఎయిమ్స్ మెడికల్ బోర్డు చీఫ్ డాక్టర్ సుధీర్ గుప్తాను సిట్ అధికారులు ప్రశ్నించారు. సునంద మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించిన బృందానికి గుప్తా నేతృత్వం వహించిన విషయం తెలిసిందే. గుప్తా సమర్పించిన రిపోర్ట్ ఆధారంగా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సునంద పుష్కర్ మరణాన్ని  హత్య కేసుగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

కేసును దర్యాప్తు చేస్తున్న డీసీపీ పీఎస్ కుష్వా, ఇన్స్పెక్టర్ రాజేందర్ సింగ్ బృందం గురువారం గుప్తాను పలు విషయాలపై ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలు వెల్లడించినట్లు సమాచారం. శశిథరూర్ తనకు కొన్ని ఈ-మెయిల్ సందేశాలు పంపినట్లు గుప్తా పోలీసులు విచారణలో తెలిపారు. అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్న శశిథరూర్ ...గుప్తాపై ఒత్తిడి తెచ్చినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.

మరోవైపు శశిథరూర్ పంపిన సందేశాలను పోలీసులు పరిశీలించినట్లు తెలుస్తోంది. కాగా గుప్తాకు శశిథరూర్ ఎందుకు ఈ-మెయిల్స్ పంపాల్సి వచ్చిందనే కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు. శశిథరూర్ను త్వరలోనే ఈకేసు విషయంపై ప్రశ్నిస్తామని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు.

 sunanda pushkar, shashi tharoor, sunanda murder, sudhir gupta, సునందా పుష్కర్, శశి థరూర్, సునంద హత్య, సుధీర్ గుప్తా
 

మరిన్ని వార్తలు