ఎస్‌ఎఫ్‌జే వెబ్‌సైట్లను బ్లాక్‌ చేసిన హోంశాఖ

5 Jul, 2020 20:53 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఉగ్రవాద కార్యకలాపాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న సిఖ్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌ఎఫ్‌జే)కు చెందిన 40 వెబ్‌సైట్లను బ్లాక్‌ చేసినట్టు హోంమంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. అమెరికాకు చెందిన ఎస్‌ఎఫ్‌జే ఖలిస్తాన్‌ అనుకూల ఉగ్ర సంస్థ. ప్రత్యేక ఖలిస్తాన్‌ ఉద్యమం కోసం పనిచేసే వారిని నిషేధిత ఎస్‌ఎఫ్‌జే ప్రోత్సహిస్తోంది. హోంమంత్రిత్వ శాఖ సూచనలకు అనుగుణంగా ఎలక్ర్టానిక్స్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఎస్‌ఎఫ్‌జేకు చెందిన 40 వెబ్‌సైట్లను బ్లాక్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి పేర్కొన్నారు.

జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందంటూ గత ఏడాది ఎస్‌ఎఫ్‌జేను హోంమంత్రిత్వ శాఖ నిషేధించింది. ఎస్‌ఎఫ్‌జే బాహాటంగా ఖలిస్తాన్‌కు మద్దతు ఇస్తోందని, ఫలితంగా దేశ సమగ్రత, సార్వభౌమత్వం, భౌగోళిక స్వరూపాలకు సవాళ్లు ఎదురవుతాయని హోం మంత్రిత్వ శాఖ అధికారి వ్యాఖ్యానించారు. వేర్పాటువాద అజెండాతో ముందుకొచ్చిన ఎస్‌ఎఫ్‌జే ఖలిస్తాన్‌పై సిక్కుల రిఫరెండంకు పిలుపుఇచ్చింది.

చదవండి : పంజాబ్‌లో ఉగ్ర దాడికి భారీ స్కెచ్‌..

మరిన్ని వార్తలు