కర్రలతో దండలు మార్చుకున్న వధూవరులు

4 May, 2020 19:38 IST|Sakshi

ముంబై: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ లాక్‌డౌన్‌లో ప్రజలంతా ఇంట్లోనే ఉంటూ భౌతికి దూరం పాటించాలి. అంతేగాక ఈ సమయంలో మత పరమైన సమావేశాలు, విందులు, వినోదాలు, వివాహం వంటి కార్యకలాపాలు జరగకుండా ప్రభుత్వం నిషేధం విధించింది. అయినప్పటికీ కనీసం బయట కాళ్లు పెట్టడానికి కూడా వీలులేని ఈ విపత్కర పరిస్థితుల్లో ఎక్కడి వారు అక్కడ ఉంటూనే పెళ్లి తంతును కానిచ్చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ముంబైకి చెందిన ఓ కుటుంబం సామాజిక దూరం పాటిస్తూనే వినూత్నంగా వివాహం వేడుకును జరిపించారు. ముఖ్యంగా ఈ జంట వినూత్నంగా దండలు మార్చుకుంటున్న ఈ టిక్‌టాక్‌ వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. (ఆన్‌లైన్ పెళ్లి; ఫోన్‌కు తాళి క‌ట్టాడు)

వీడియోలో వధూవరూలు మాస్క్‌లు ధరించి కనీసం మీటరు భౌతిక దూరం పాటిస్తూ.. కర్రలతో పూల దండలను మార్చుకుంటున్న వీడియోకు ‘‘విపత్కర కాలంలో ఎవరైతే వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది’ అనే క్యాప్షన్‌తో ట్విటర్‌లో షేర్‌ చేశారు. అయితే సామాజిక దూరం పాటిస్తూ వివాహం చేసుకున్న వీరిపై కొంతమంది నెటిజన్లు ప్రశంసిల జల్లు కురిపిస్తుంటే మరికొందరూ ‘‘చేతికి గ్లౌజ్‌లు లేకుండానే ఒకరి నుంచి మరోకరు కర్రలను ఏలా పట్టుకున్నారంటూ’’ నెటిజన్లు మండిపడుతున్నారు. కాగా కరోనా వైరస్‌ కోరలు చాస్తున్నప్పటికీ పలువురు వివాహం జరుపుకుంటున్నపలు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కేవలం కుటుంబ సభ్యులతో కలిసి తమ ఇంటి వద్దే పెళ్లి చేసుకుంటుండగా మరికొందరు ఎవరి ఇంట్లోనే వారుండి ఆన్‌లైన్‌లో‌, వీడియో కాల్‌లోనే వివాహా తంతు కానిచ్చేస్తున్నారు. అంతేగాక భౌతికంగా తాళి కట్టే వీలు లేకపోవడంతో సెల్‌ఫోన్‌కు తాళి కట్టిన ఓ వీడియో తెగ వైరల్‌ అయిన విషయం తెలిసిందే. (ఫేస్‌బుక్‌ కొత్త ఎమోజీ.. ఫన్నీ మీమ్స్‌ వైరల్)

మరిన్ని వార్తలు