వీకెండ్‌ ఫోకస్‌.. వార్తల్లో వ్యక్తులు

5 Jan, 2020 02:33 IST|Sakshi

బిపిన్‌ రావత్‌
సుదీర్ఘ నిరీక్షణ అనంతరం దేశ రక్షణ రంగంలో కీలకమార్పు చోటుచేసుకుంది. దేశ రక్షణ బలగాల తొలి అధిపతి (చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌– సీడీఎస్‌)గా బిపిన్‌ రావత్‌ నియామకమయ్యారు. త్రివిధ రక్షణ బలగాల వ్యవహారాలకు బిపిన్‌ రావత్‌ ఇకపై బాధ్యత వహిస్తారు. జనవరి 1వ తేదీన జనరల్‌ బిపిన్‌ రావత్‌ బాధ్యతలు చేపట్టారు. మూడేళ్ల పాటు ఈయన ఈ బాధ్యతల్లో కొనసాగుతారు.

మాలావత్‌ పూర్ణ
ప్రపంచంలోనే చిన్న వయస్సులో మౌంట్‌ ఎవరెస్ట్‌ని అధిరోహించిన ఘనతను సాధిం చిన తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ గురుకుల పాఠశాల విద్యార్థిని మాలావత్‌ పూర్ణ మరో సాహసాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. డిసెంబర్‌ 26న అంటార్కిటికా ఖండంలో 16,050 అడుగుల ఎత్తైన విస్సన్‌ మసిఫ్‌ పర్వతంపై అడుగుమోపారు. ప్రపంచంలో ని ఎత్తైన ఏడు ఖండాల్లో ఆరింటిని అధిరోహించిన పూర్ణ.. ఇక ఉత్తర అమెరికాలోని ‘డెనాలీ’ పర్వతాన్ని అధిరోహించాల్సి ఉంది. 

మలాలా యూసఫ్‌ జా
నోబెల్‌ బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌ జాని ‘‘మోస్ట్‌ ఫేమస్‌ టీనేజర్‌ ఇన్‌ ద వరల్డ్‌’’గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. బాలికల విద్య కోసం గొంతెత్తి నినదించిన మలాలా, తాలిబన్ల అకృత్యాలను ప్రపంచవ్యాప్తంగా ఎలుగెత్తి చాటారు. అతిచిన్న వయస్సులోనే ప్రారంభించిన ఆమె ఉద్యమ సంకల్పాన్ని ఐక్యరాజ్యసమితి కొనియాడింది. 

మరిన్ని వార్తలు