పశ్చిమ బెంగాల్ ఇకపై ‘బెంగాల్’

3 Aug, 2016 02:19 IST|Sakshi
పశ్చిమ బెంగాల్ ఇకపై ‘బెంగాల్’

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పేరు ‘బెంగాల్’గా మార్చాలన్న ప్రతిపాదనను ఆ రాష్ట్ర కేబినెట్ మంగళవారం ఆమోదించింది. ఆంగ్లంలో ‘వెస్ట్ బెంగాల్’ ఇక బెంగాల్ కాగా, బెంగాలీ భాషలో ‘బంగ్లా’ లేదా ‘బంగా’గా పిలవాలని నిర్ణయించినట్లు రాష్ట్ర మంత్రి పార్థ ఛటర్జీ చెప్పారు.  ఈ నెల అసెంబ్లీ ప్రత్యేక భేటీల్లో పేరు మార్పును ఆమోదించాక దాన్ని కేంద్రానికి పంపనుంది. పేరు మార్పునకు రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ‘బెంగాల్’ పదం ఆ రాష్ట్ర సంస్కృతికి సూచికగా పరిగణిస్తుండటంతో పేరు మార్చాలనే వాదన ఉంది. ఇంగ్లీష్‌లోని వెస్ట్ బెంగాల్ అని పిలుస్తుండటంతో కేంద్రం జరిపే ముఖ్యమంత్రుల  భేటీల్లో  ఈ రాష్ట్ర సీఎంకు అక్షరక్రమంలో చివర్లో మాట్లాడాల్సి రావడం మరో కారణం.

మరిన్ని వార్తలు