పెద్ద మనసు చాటుకున్న మమతా బెనర్జీ

14 May, 2020 16:35 IST|Sakshi

కోల్‌కత్తా: కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో ఎక్కడివారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో  వలస కార్మికుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. పనుల కోసం సొంత ఊరిని వదిలి ఉపాధిని వెతుకుంటూ వచ్చిన వారికి ఇక్కడ ఉద్యోగం లేక ఏం చేయాలో తోచక చాలా కష్టాలు పడ్డాయి. ఎప్పుడెప్పుడు లాక్‌డౌన్‌ అయిపోతుందా ఇంటికి వెళ్లి అయిన వారిని చూసుకుందాం అని ఆశపడిన వారికి లాక్‌డౌన్‌ను మూడు సార్లు సడలించడంతో నిరాశే మిగిలింది. అందుకే చాలా మంది వలస కార్మికులు కాలినడకనే వేల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి ఇంటిని చేరకుండానే ప్రాణాలు కూడా కోల్పొయారు. అయితే వలస కార్మికులను ఇంటికి చేర్చడం కోసం కేంద్రప్రభుత్వం శ్రామిక్‌రైళ్ల పేరిట ప్రత్యేక రైళ్లను మే1 వతేదీ నుంచి అందుబాటులోనికి తెచ్చింది. 

అయితే వీటితో పాటు వలస కార్మికుల కోసం 105 ప్రత్యేక రైళ్లను కూడా నడిపించనున్నట్లు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ తెలిపారు. దీనికి సంబంధించి ఆమె ట్వీట్‌ చేశారు. ఈ ప్రత్యేక ట్రైన్లు వివిధ ప్రాంతాల నుంచి త్వరలో ప్రారంభం కానున్నాయి అని మమత పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌గోయల్‌ బెంగాల్‌ ప్రభుత్వం వలస కార్మికుల రైళ్లను రాష్ట్రంలోకి అనుమతించబోము అని పేర్కొంది అని ఆరోపించిన ఒక్కరోజు తరువాతే మమత ఈ ప్రకటన చేయడం గమనార్హం. 

ఇదేవిషయం కేంద్రహోం మంత్రి అమిషా కూడా మమతకు చాలా సార్లు లేఖ రాశారు. వలస కార్మికులు కూడా మీ ప్రజలే. వారిని ఇంటికి తిరిగి రానివ్వండి. ఆర్ధిక వ్యవస్థ బాగుపడి వారికి ఉద్యోగాలు దొరుకుతాయి దీనిని రాజకీయం చేయ్యొద్దు అంటూ కూడా అమిత్‌ షా చాలా సార్లు పేర్కొన్నారు. ఈ విషయంలో బెంగాల్‌ ప్రభుత్వానికి, కేంద్ర సర్కార్‌కి మధ్య యుద్దమే నడిచింది. అయితే కరోనా కట్టడి విషయంలో కేంద్రం చేపడుతున్న అనేక చర్యలను దీదీ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు