1950లో ఏం జరిగింది?!

17 Sep, 2017 17:57 IST|Sakshi
1950లో ఏం జరిగింది?!

స్వతంత్ర భారతానికి ఎందరో ప్రధానులు వచ్చారు.. ఒక్క నరేంద్ర మోదీకే ఎందుకంత ప్రత్యేకత? మోదీ  జన్మించిన 1950 సంవత్సరం ఏం జరిగింది? మోదీని ప్రభావితం చేసిన అంశాలేంటి? కరుడుగట్టిన హిందుత్వ వాదిలా మోదీ ఎందుకు మారారు? తెలుసుకోవాలంటే ఈ ప్రత్యేక కథనాన్ని చదవాల్సిందే.

సెప్టెంబర్‌ 17.. స్వేచ్ఛావాయువులు పీల్చుకునే స్వతంత్ర భారతంలో జన్మించిన తొలి ప్రధాని నరేంద్ర మోదీ  జన్మదినం. ఆయన పుట్టిన రోజున సహజంగానే బీజేపీ శ్రేణులు అట్టహాసంగా నిర్వహిస్తాయి. అందులోనూ ప్రధాని మోదీ తన పుట్టిన రోజున స్వచ్ఛ దివస్‌గా నిర్వహించాలని పిలుపునివ్వడంతో సాధారణ కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి వరకూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మించిన 1950  చారిత్రక విశేషాలను ఒక్కసారి పరిశీలిస్తే...

  • దేశానికి 1947లో స్వతంత్రం వచ్చినా.. 1950 వరకూ బ్రిటన్‌ అధికారిక వైస్రాయి పాలనలో ఉంది. అప్పటి బ్రిటన్‌ రాజు జార్జి VI దేశానికి వైశ్రాయ్‌గా వ్యవహరించారు.
  • భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ 1950, జనవరి 26న ఆమోదించింది. రాజ్యాంగం అమల్లోకి రావడంతో  వైస్రాయి పాలన, రాచరిక అనువంశిక పాలన ముగిసింది. 1950లోనే భారత దేశం సర్వసత్తాక, సామ్యవాద,  ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది.
  • రిపబ్లిక్‌ ఇండియాకు తొలి రాష్ట్రపతిగా బాబూ రాజేంద్రప్రసాద్‌ 1950 జనవరి 26న ప్రమాణ స్వీకారం చేశారు.
  • నిజం చెప్పాలంటే.. భారతదేశం గణతంత్ర, ప్రజాస్వామ్య దేశంగా ఆ రోజే ఆవిర్భవించించింది. అప్పటివరకూ భారత దేశానికి గవర్నర్‌ జనరల్‌గా వ్యవహరించిన చక్రవర్తి రాజగోపాలచారి రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌ హాల్లో బాబూ రాజేంద్రప్రసాద్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. రాజేంద్రప్రసాద్‌ ప్రమాణ స్వీకారం తరువాత  సైనికులు 31 సార్లు గాల్లోకి కాల్పులు జరిపారు.
  • భారతదేశంగా గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించడానికి ఒక్క రోజు ముందు స్వతంత్ర ఎన్నికల వ్యవస్థ (ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా) పురుడుపోసుకుంది. రాజ్యాంగం ప్రకారం దేశంలోని పౌరులందరికీ.. సార్వజనీన ఓటు హక్కును ప్రసాదించింది.
  • అప్పుడే స్వతంత్రం పొందిన భారత్‌ - నేపాల్‌ తొలిసారిగా మిత్రదేశాలుగా ఉండేందుకు అంగీకారానికి వచ్చాయి. పూర్వకాలం నుంచి ఉన్న మత, రాజకీయ, సాంస్కృతిక సారూపత్యలను కాపాడుకుంటూ..ఒకరికొకరు సహాయం చేసుకునేందుకు ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయి. 1950లోనే ఇరు దేశాలు శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి.
  • భారతదేశ ఆర్థిక వ్యవస్థకు, పరిశ్రమలు, రైల్వేలు, వ‍్యవసాయాభివృద్ధికి జీవం పోసిన ప్రణాళికా సంఘం 1950లోనే ఆవిర్భవించింది. పంచవర్ష ప్రణాళికల పేరుతో దేశాభివృద్ధికి ప్రాణాళికా సంఘం దిశానిర్దేశం చేసింది. ప్లానింగ్‌ కమిషన్‌ మొత్తం 12 పంచవర్ష ప్రణాళికలు రూపొందించింది.
  • దేశ విభజన తరువాత మొదటిసారి పాకిస్తాన్‌ ప్రధాని లియాఖత్‌ ఆలీఖాన్‌, భారత ప్రధాని పండిట్‌ నెహ్రూ ఢిల్లీ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఆయా దేశాలకు వెళ్లాలనుకునేవారిని స్వేచ్ఛగా, వారి ఆస్తులతో సహా పంపాలని నిర్ణయించారు. అయితే పాకిస్తాన్‌ నుంచి భారత్‌కు వచ్చే వారిని నిర్దాక్షిణ్యంగా హత్య చేయడంతోపాటు.. లక్షలాదిమంది మహిళలపై అత్యాచారాలు చేశారు.
  • 1950 వరకూ బ్రిటన్‌ ఆధీనంలో ఉన్న అండమాన్‌ నికోబార్‌ దీవులు, బర్మా (నేటి మయన్మార్‌)లను భారత్‌లో విలీనం చేసింది.
  • అదే ఏడాది స్వాతంత్ర దినోత్సవం నాడు.. అసోం, టిబెట్‌లో అతిపెద్ద భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 8.6గా నమోదైంది. ఈ ఘటనలో 3 వేల మంది ప్రజలు మరణించి ఉంటారని అంచనా.
  • సెప్టెంబర్‌ 17న నరేంద్ర దామోదర్‌ దాస్‌ మోదీ.. ప్రస్తుత గుజరాత్‌ (నాటి బొంబాయి స్టేట్‌)లో జన్మించారు.


 

మరిన్ని వార్తలు