స్తంభించిన వాట్సాప్‌, ఫేస్‌బుక్‌

4 Jul, 2019 07:58 IST|Sakshi

న్యూఢిల్లీ : వాట్సాప్‌లో మీడియా ఫైళ్లు డౌన్‌లోడ్‌ కావడం లేదంటూ బుధవారం రాత్రి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగాంలు కూడా సరిగ్గా పనిచేయడం లేదని అనేకమంది నెటిజన్లు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఇండియాలో ఈ సమస్య ఏమంత పెద్దగా కనిపించలేదు. ప్రధానంగా దక్షిణ అమెరికా, యూరప్‌ ఖండాల్లోని ప్రజలు సమస్యను ఎదుర్కొన్నారు. ఫేస్‌బుక్‌ సర్వర్లలో తలెత్తిన సమస్య కారణంగానే వాట్సాప్, ఇన్‌స్ట్రాగాంలు కూడా సరిగ్గా పనిచేయలేదని తెలుస్తోంది. అయితే ఈ సమస్యపై మూడింటిలో ఏ సంస్థా అధికారిక ప్రకటన చేయలేదు. ఈ ఏడాది మార్చిలోనూ ఇలాంటి సమస్యే తలెత్తింది. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా