వాట్సప్‌ క్రాష్‌ ; న్యూఇయర్‌ విషెష్‌ వెల్లువెత్తడంతో..

1 Jan, 2018 07:53 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రఖ్యాత మెసేజింగ్‌ సర్వీస్‌ యాప్‌ వాట్సప్‌ క్రాష్‌డౌన్‌ కావడంతో ప్రపంచవ్యాప్తంగా కొద్దిపాటి కలకలంరేగింది. ఊహకు అందని రీతిలో న్యూఇయర్‌ విషెస్‌ వెల్లువత్తడంతో ఏర్పడిన సాంకేతిక సమస్యలే ఇందుకు కారణమని సంస్థ ప్రతినిధులు తెలిపారు. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:10 గంటల నుంచి దాదాపు 2 గంటలపాటు వాట్సప్‌ నిలిచిపోయినట్లు ఫిర్యాదులు అందాయి.

తొలుత న్యూజిలాండ్‌లో వేడుకలు మొదలు.. వరుసగా ఆస్ట్రేలియా, జపాన్‌, చైనా, హాంకాంగ్‌, భారత్‌, శ్రీలంక, పాకిస్తాన్‌ అటుపై పశ్చిమదేశాలు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాయి. ఆయా దేశాల్లో శుభాకాంక్షల మెసేజ్‌లు వెల్లువెత్తడంతో మెసేజింగ్‌ యాప్‌లో సమస్యలు తలెత్తాయి. దీంతో యూజర్లకు కలిగిన అంతరాయానికి క్షమాపణలు చెబుతూ వాట్సప్‌ ప్రతినిధులు ఒక ప్రకటన చేశారు. ప్రస్తుతానికి వాట్సప్‌ యధావిధిగా పనిచేస్తోంది. 

మరిన్ని వార్తలు