వాట్సాప్‌ డౌన్‌ : యూజర్లు విలవిల

19 Jan, 2020 19:06 IST|Sakshi

న్యూఢిల్లీ : ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ ఆదివారం సాయంత్రం 4.15 గంటల ప్రాంతంలో మొరాయించడంతో ప్రపంచ వ్యాప్తంగా యూజర్లు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. వాట్సాప్‌ ఔటేజ్‌తో తాము ఫోటోలు, వీడియోలు, స్టిక్కర్లు షేర్‌ చేసుకోలేకపోయామని వాట్సాప్‌ యూజర్లు ఆందోళన వ్యక్తం చేశారు. వాట్సాప్‌ స్టేటస్‌లోనూ తాము వీడియోలు, ఫోటోలను వీక్షించలేకపోయామని యూజర్లు ఫిర్యాదు చేశారు. వాట్సాప్‌ పనిచేయకపోవడంతో యూజర్లు మెసేజ్‌లు పంపడం, రిసీవ్‌ చేసుకోవడంలో సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ట్రాకింగ్‌ వెబ్‌సైట్‌ డౌన్‌డిటెక్టర్‌ వెల్లడించింది.

వాట్సాప్‌ డౌన్‌ కావడంతో ఇండియా, యూరప్‌, మలేషియా, ఇండోనేషియా, బ్రెజిల్‌ సహా పలు దేశాల యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఔటేజ్‌ మ్యాప్‌లో కనిపించింది. వాట్సాప్‌ డౌన్‌ కావడంతో యూజర్లు ట్విటర్‌ సేవలను ఉపయోగించుకున్నారు. ఆ సమయంలో ట్విటర్‌ ఇండియాలో వాట్సాప్‌డౌన్‌ హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అయింది. వాట్సాప్‌ సేవలు కొద్దిసేపటికి పునరుద్ధరించడంతో యూజర్లు ఊపిరి పీల్చుకున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

లాక్‌డౌన్‌తో రైతులకు నష్టం వాటిల్లదు: నీతి ఆయోగ్‌ 

ఒక్కొక్కరి ద్వారా 406 మందికి కరోనా 

దేశీయ అవసరాలు తీరాకే..! 

జనసమ్మర్ధం ఎక్కడెంత ?

లాక్‌డౌన్‌ కొనసాగింపు?

సినిమా

పెద్దాయన సన్‌ గ్లాసెస్‌ వెతకండ్రా

రూ.1.25 కోట్ల విరాళం ప్ర‌క‌టించిన అజిత్‌

టిక్‌టాక్ వీడియోపై ర‌ష్మి ఆగ్ర‌హం

క‌రోనా : న‌టి టిక్‌టాక్ వీడియో వైర‌ల్‌

నటుడి కుటుంబానికి కరోనా.. ధైర్యం కోసం పోస్టు!

మాస్క్‌లు వ‌దిలేసి, చున్నీ క‌ట్టుకోండి: విజ‌య్