సంపాదన స్థాయిని బట్టి మనోవర్తి: సుప్రీం

24 Apr, 2017 02:06 IST|Sakshi

న్యూఢిల్లీ: విడాకులు పొందిన వారి స్థాయిని బట్టి మనోవర్తి నిర్ణయం ఉండాలని సుప్రీం కోర్టు పేర్కొంది. కేసులోని వాస్తవ పరిస్థితుల ఆధారంగా, వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని కోర్టులు శాశ్వత మనోవర్తిని నిర్ణయించాలని సూచించింది.

తన మొదటి భార్యకు ఇవ్వాల్సిన భరణాన్ని రూ. 16 వేల నుంచి రూ. 23 వేలకు కలకత్తా హైకోర్టు పెంచడాన్ని సవాలు చేస్తూ విడాకులు పొందిన ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. పిటిషనర్‌ జీతం రూ. 63 వేల నుంచి రూ. 95 వేలకు పెరగడాన్ని దృష్టిలో ఉంచుకుని హైకోర్టు భరణం పెంచిందని సుప్రీం కోర్టు  గుర్తించింది. అయితే విడాకులు పొందిన వ్యక్తి మరో పెళ్లి చేసుకున్నాడు. మరో బిడ్డకు తండ్రి అయ్యాడు. దీనిని దృష్టిలో పెట్టుకున్న కోర్టు  భరణాన్ని రూ. 20 వేలకు తగ్గించింది.

>
మరిన్ని వార్తలు