గొలుసు దొంగల్ని పట్టిస్తే నగదు బహుమతి

28 Oct, 2014 23:02 IST|Sakshi
గొలుసు దొంగల్ని పట్టిస్తే నగదు బహుమతి

రూ. 15 వేలు ఇస్తామని ప్రకటించిన పోలీసు శాఖ

సాక్షి, ముంబై: గొలుసు దొంగతనాలను అరికట్టేందుకు పోలీసు శాఖ ఓ వినూత్న యోచన చేసింది. దొంగల్ని పట్టించిన వారికి రూ.15 వేలు నగదు బహుమతి ప్రకటించింది. మరోవైపు గొలుసు దొంగతనాలకు అడ్డుకట్టవేసేందుకు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా ఠాణే పోలీసు శాఖ సెంట్రల్ యూనిట్‌ను ఏర్పాటుచేసింది. పట్టుబడిన గొలుసు దొంగలపై మోకా చట్టం కింద కేసు నమోదు చేయడం ప్రారంభించింది. అయినప్పటి కీ ఎటువంటి ఫలితమూ లేకపోయింది.

ఇది పోలీసుశాఖకు సవాలుగా మారింది. దీంతో గొలుసు దొంగల్ని పట్టుకునేందుకు అవసరమైతే ఆయుధాలను వినియోగించాలని హోం శాఖ మాజీ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ అప్పట్లో తన సిబ్బందిని ఆదేశించారు. మహిళలు రోడ్లపై నడవకుండా కార్పొరేషన్ సహాయంతో ఫుట్‌పాత్‌లను ఖాళీ చేయించాలని నిర్ణయించారు. అయితే ముంబై, ఠాణే లాంటి కీలక నగరాల్లో ఫుట్‌పాత్‌లను ఖాళీ చేయించడం సాధ్యం కాలేదు. దీంతో చేతులెత్తేసిన పోలీసు శాఖ ఈ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. గొలుసు దొంగలను పట్టుకునే బాధ్యత నగర పౌరులకే వదిలే సింది. ఇందుకు పారితోషికం కింద రూ. 15 నగదు బహుమతిని అందజేసేందుకు సైతం సిద్ధపడింది.

బహుమతి ప్రకటించే సమయంలో మహిళలకు కొన్ని సూచనలు కూడా చేసింది. గృహిణులు, ఉద్యోగం చేసే మహిళలు ఇంటి నుంచి బయట ముందు సాధ్యమైనంత వరకు తక్కువ నగలు ధరించాలి. నిర్మానుష్య ప్రాంతాల్లో ఒంట రిగా నడవకూడదు. మంగళసూత్రం లేదా గొలుసు వేసుకుంటే మెడను చీర కొంగు లేదా దుప్పట్టా (చున్నీ)తో కప్పుకోవాలి. గొలుసు దొంగలు హెల్మెట్ ధరిస్తే కేకలు వేయడంతోపాటు వారు పారిపోతున్న వాహనం నంబరును నోట్ చేసుకోవాలని సూచించింది. ఇందువల్ల వారిని పట్టుకోవడం మరింత సులభమవుతుందని ఆ శాఖ భావిస్తోంది.

మరిన్ని వార్తలు