భర్త ఇంటి ముందు దీక్ష

19 Jun, 2014 00:59 IST|Sakshi
భర్త ఇంటి ముందు దీక్ష

తిరువొత్తియూరు:వరకట్నం కోసం వేధిస్తున్న భర్త, మామ, అత్తలపై చర్యలు తీసుకోవాలని భర్త ఇంటి ముందు భార్య దీక్ష చేపట్టింది. చెన్నై అరుంబాక్కంకు చెందిన వైదేహికి, ఐనావరం వెస్టుమాడ వీధికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జగదీష్‌కు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహ సమయంలో 47 సవర్ల నగలు, కట్న కానుకలు వధువు ఇంటి వారు వరుడికి ఇచ్చారు. అయితే అదనంగా రూ.15 లక్షల వరకట్నం కోరు తూ జగదీష్, మామ ఆర్ముగం, అత్త చంద్ర కలిసి వైదేహిని చిత్ర హింసలు పెట్టారు. దీంతో  ఆరు నెలలకు ముందు వైదేహ  పుట్టింటికి వెళ్లిపోయింది.
 
 అనంతరం కుటుంబ సభ్యుల సూచన మేరకు భర్త, అత్త మామలపై తగు చర్యలు తీసుకోవాలని ఐనావరం పోలీ సులకు మార్చి 12న ఫిర్యాదు చేసింది. కానీ ఫిర్యాదుపై పోలీసులు తగు చర్యలు తీసుకోలేదు. ముందస్తు జామీ న్ కోరుతూ చెన్నై జిల్లా కోర్టులో జగదీష్ దరఖాస్తు చేసుకున్నాడు. తర్వాత వైదేహి నుంచి విడాకులు కోరుతున్నట్టు నోటీసు పంపాడు. ఇది చూసిన వైదేహి దిగ్భ్రాంతి చెందింది. మంగళవారం ఉద యం జగదీష్ దాఖలు చేసిన విడాకుల పిటిషన్ కోర్టులో తోసిపుచ్చారు. దీంతో వైదేహి తిరిగి మంగళవారం మధ్యాహ్నం ఐనావరం మహిళ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
 
 ఆ సమయంలో ఇన్‌స్పెక్టర్ లీలావతి, పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో వైదేహి రాత్రి 10 గంటలకు భర్త ఇంటి ముందు కూర్చుని ధర్నా చేపట్టింది. బుధవారం కూడా వైదేహి దీక్ష కొనసాగించింది. దీనిపై సమాచారం అందుకున్న ఐనావరం పోలీసు ఇన్‌స్పెక్టర్ కనకరాజ్, పోలీసు లు అక్కడికి చేరుకుని వైదేహితో చర్చలు జరిపారు. భర్త, అత్త, మామలను అరె స్టు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో వైదేహి దీక్ష విరమించింది.  
 

మరిన్ని వార్తలు