జీఎస్టీ అమలైతే వస్తువులు, సేవల ధరల్లో మార్పులిలా..

22 May, 2017 02:41 IST|Sakshi
జీఎస్టీ అమలైతే వస్తువులు, సేవల ధరల్లో మార్పులిలా..

రెస్టారెంట్లు, హోటళ్లు
రూ.20 లక్షలలోపు వార్షిక టర్నోవర్‌ కలిగిన రెస్టారెంట్లకు పన్ను ఉండదు. రూ.50 లక్షల వార్షిక టర్నోవర్‌ కలిగి ఉండి, నష్ట పరిహారం పథకాన్ని ఎంచుకునే రెస్టారెంట్లపై 5 శాతం లెవీ ఉంటుంది. రూ. 20 లక్షల కన్నా అధిక వార్షిక టర్నోవర్‌ కలిగిన నాన్‌–ఏసీ రెస్టారెంట్లపై 12 శాతం, మద్యం అమ్మకాల లైసెన్సు కలిగిన ఏసీ రెస్టారెంట్లపై 18 శాతం, ఐదు నక్షత్రాల హోటళ్లపై 28 శాతం పన్ను ఉంటుంది.

ధరల్లో మార్పు ఉండనివి...
పాలు, కూరగాయలు, పండ్లు, బ్రెడ్లు, బాస్మతీ బియ్యం, గోధుమ పిండి, తృణ ధాన్యాలు

మినహాయింపు కలిగిన సేవలు
విద్య, వైద్యం, ద్వితీయ శ్రేణి, లోకల్‌ రైళ్ల టికెట్లు

స్వల్పంగా తగ్గేవి..
సరకు రవాణా, ఏసీ రైలు ప్రయాణం, ఎకానమీ క్లాస్‌ విమాన ప్రయాణం, క్యాబ్‌ అగ్రిగేటర్‌ సేవలు, కొన్ని రాష్ట్రాల్లో సినిమా టికెట్లు. అయితే బిజినెస్‌ క్లాస్‌ విమాన టికెట్లు, కాంట్రాక్టు పనుల ధరలు మాత్రం స్వల్పంగా తగ్గొచ్చు లేదా ఇప్పటిలాగే ఉండొచ్చు.

పెరిగేవి..
రేస్‌ క్లబ్బుల్లో బెట్టింగ్‌. టెలికాం, ఆర్థిక సేవలపై పన్ను రేటు పెంచినా ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ వల్ల ధరలు ఇప్పటిలాగే ఉండొచ్చని ప్రభుత్వం చెబుతోంది.


మరిన్ని వార్తలు