రజనీ, మోడీ మ్యాజిక్ పనిచేస్తుందా?

21 Apr, 2014 12:21 IST|Sakshi
రజనీ, మోడీ మ్యాజిక్ పనిచేస్తుందా?
తమిళనాడులో ఎన్నో ఎళ్లుగా డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలదే హవా. ఒకరు అధికారంలో ఉంటే మరొకరు ప్రతిపక్షంలో ఉండాల్సిందే. ఎన్నో పార్టీలు రాజకీయ ప్రవేశం చేసినా డీఎంకే, అన్నాడీఎంకేలను ఎదురించలేకపోయాయి. మూడో పార్టీగా ఎదుగడానికి చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ పార్టీ కాంగ్రెస్ కు కూడా తమిళనాట అస్థిత్వమే లేకపోగా, అక్కడి రాజకీయాల్లో నామమాత్రమైన పార్టీగా చెలామణి అవుతోంది. 
 
అయితే ఈ రెండు పార్టీలకు చెక్ పెట్టేందుకు డీఎండీకే, పీఎంకే, ఎండీఎంకే, ఐపీకే పార్టీలన్నింటిని ఏకం చేసి బీజేపీ ఓ కూటమి ఏర్పడి రెండు పార్టీలను ఎదురించడానికి ఓ ప్రయత్నాన్ని ప్రారంభించింది. అంతేకాకుండా ప్రస్తుత ముఖ్యమంత్రి జయలలితకు సూపర్ స్టార్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రితీలో ఉండటం బీజేపీ గమనించింది. వారి మధ్య వైరాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని.. తమిళనాట రాజకీయ ఆధిపత్యం కొనసాగించడానికి రజనీకాంత్ మద్దతును బీజేపీ కోరడానికి ఏకంగా నరేంద్రమోడీ అస్త్రాన్ని ప్రయోగించింది. 
 
దాంతో ఇటీవల చెన్నైలో రజనీకాంత్ ను మోడీ కలిశృ఼రు. బీజేపీకి మద్దతు తెలిపాలని రజనీకాంత్ ను మోడీ అభ్యర్ధించారు. అందుకు రజనీ బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. సానుకూలంగానే స్పందించారు. రజనీకాంత్ భేటికి ముందు బీజేపీపై దుమ్మత్తిన జయలలిత.. ఆతర్వాత కొంత వెనకడుగు వేశారు.  నాగర్ కోయిల్ లో ఇటీవల నిర్వహించిన సభ లో జయలలితపై మోడీ ఎటాక్ ప్రారంభించారు. మోడీ సభకు ముందు ఒకరోజు తమిళనాడులోని ఐదు ప్రముఖ చానెల్లకు మోడీ ఇంటర్వూ ఇచ్చారు. మరుసటి రోజు ఏర్పాటు చేసిన సభలో మత్స్యకారుల ప్రయోజనాలను పరిరక్షించడంలో జయ ప్రభుత్వం విఫలమైందని మోడీ ఆరోపించారు.  మత్స్యకారుల విషయంలో మేడమ్ సోనియాను అమ్మ నిందించడం.. అమ్మను మేడమ్ నిందించడం మాత్రమే జరుగుతోందని మోడీ అన్నారు. 
 
ఇక రెండవ ప్రధాన పార్టీ డీఎంకేలో కుటుంబ విబేధాలు నెలకొనడంతో కార్యకర్తల్లో గందరగోళ నెలకొంది. దాంతో అన్నాడీఎంకేపై టార్గెట్ చేస్తూనే.. డీఎంకే క్యాడర్ ను బీజేపీ కూటమి తిప్పుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. 2016 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ కూటమి బలపేతం కావాలని ప్రణాళిక రచిస్తోంది. అందుకే రజనీకాంత్ తో సయోధ్యను జరపుతోంది. బీజేపీ కూటమికి రజనీకాంత్ తోడైతే.. తమిళనాడు రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించేందుకు బీజేపీ బృందం కొత్త ఎత్తుగడలతో ముందుకెళ్తోది. రజనీకాంత్ ను ప్రసన్నం చేసుకుంటే బీజేపీ తన పని కొంత సులభం అవుతందని భావిస్తోంది. అన్నాడీఎంకే, డీఎంకేలను ఎదురించే స్థాయిలో రజనీ, మోడీల మ్యాజిక్ ఈ ఎన్నికల్లోనూ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేస్తుందా అనే అంశంపై వేచి చూడాల్సిందే. 
మరిన్ని వార్తలు