నవంబర్‌ 8న పబ్లిక్‌ హాలిడే దొరుకుతుందా?

25 Oct, 2017 18:47 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పెద్ద నోట్లు రద్దు అయి ఏడాది కావొస్తోంది.. హఠాత్తుగా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ప్రకటించిన నవంబర్‌ 8న విపక్షాలు బ్లాక్‌ డేగా నిర్వహించాలని చూస్తుండగా... మోదీ ప్రభుత్వం దీన్ని 'యాంటీ-బ్లాక్‌ మనీ' డేగా నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. ఇటు ప్రభుత్వం, అటు విపక్షాలు ఎవరెన్ని చేసినా.. నెటిజనులు మాత్రం హాలిడే కావాలంటున్నారు. తమకు​ పబ్లిక్‌ హాలిడే దొరుకుతుందా అంటూ ట్విటర్ యూజర్లు గడుసుగా అడుగుతున్నారు. అంతేకాక నవంబర్‌ 8న నేషనల్‌ హాలిడే ప్రకటించడం అద్భుతమైన ఐడియా అంటూ ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారు.

నవంబర్‌ 8న నిజంగానే యాంటీ-బ్లాక్‌మనీ డేగా నిర్వహించాలని ఎందుకంటే ఆ రోజే పింక్‌ మనీ కనుగొనబడిందని, అంతకు మించి ఏమీ లేదంటూ నెటిజనులు విసుర్లు వదులుతున్నారు. నవంబర్‌ 8పై ట్విటర్‌లో నెటిజనుల రియాక్షన్‌ భారీగానే ఉంది. పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు గతేడాది నవంబర్‌ 8 రోజు రాత్రి ప్రధాని మోదీ చేసిన ప్రకటనతో ఒక్కసారిగా దేశంలో ఉన్న 86 శాతం నగదు నిరూపయోగంగా మారింది. అనంతరం జరిగిన పరిణామాలపై ప్రభుత్వంపై పెద్ద ఎత్తునే విమర్శలు వచ్చినప్పటికీ, ప్రస్తుతానికి పరిస్థితి కుదుటపడింది. నోట్ల రద్దు అనంతరం ఏర్పడిన చిల్లర కష్టాలకు చెక్‌ పెట్టడానికి ఆర్‌బీఐ చిన్న నోట్లను సైతం ప్రవేశపెడుతోంది.

మరిన్ని వార్తలు