ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

26 Nov, 2015 11:35 IST|Sakshi

న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం ఉభయ సభలు జాతీయ గీతంతో ఆరంభం అయ్యాయి.  లోక్ సభ ప్రారంభం కాగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ ...ఇటీవల వరంగల్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన పసునూరి దయాకర్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన  తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం స్పీకర్ సుమిత్రా మహాజన్... ఇటీవల మృతి చెందిన సభ్యులు, మాజీ సభ్యులకు సంతాప తీర్మానం చదివి వినిపించారు.  

కాగా రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గౌరవార్థం ఇవాళ, రేపు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ సేవలను స్పీకర్ కొనియాడారు. ఇక  డిసెంబర్ 23 వరకూ పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతాయి. మరోవైపు మృతి చెందిన సభ్యులకు సంతాప తీర్మానం అనంతరం  రాజ్యసభ శుక్రవారానికి వాయిదా పడింది.

మరిన్ని వార్తలు