టైపింగ్‌లో తప్పిదం.. పరారీలో హంతకుడు

3 Apr, 2017 20:24 IST|Sakshi

న్యూఢిల్లీ: టైపింగ్‌లో తప్పు దొర్లడంతో ఓ హంతతకుడు జైలు నుంచి విడుదల అయ్యాడు. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో టైపింగ్‌ తప్పిదంతో రెండు హత్య కేసుల్లో దోషిగా నిర్ధారణ అయిన వ్యక్తి జైలు నుంచి రిలీజ్‌ అయ్యాడు.  ఢిల్లీ వర్సిటీ మాజీ విద్యార్థి అయిన జితేందర్‌ 1999 మార్చి 10న ఓ విద్యార్థి సంఘ నాయకుడ్ని హత్య చేశాడు. ఆ మరుసటి రోజు ఈ ఘటనపై పోలీసులకు సమాచారమిచ్చిన ఓ సాక్షి ఇంటికి వెళ్లి అతని తండ్రిని చంపేశాడు.

జితేందర్‌కు మొదటి కేసులో 30 ఏళ్ల జైలు శిక్ష, మరో కేసులో జీవిత ఖైదు విధిస్తూ ట్రయల్‌ కోర్టు తీర్పునిచ్చింది. దీనిపై జితేందర్‌ ఢిల్లీ హైకోర్టులో అప్పీల్‌ చేశాడు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం జితేందర్‌ ఇప్పటికే 16 ఏళ్ల 10 నెలల పాటు జైలు శిక్ష అనుభవించినందున అతన్ని విడుదల చేస్తూ 2016 డిసెంబర్‌ 24న తీర్పు వెలువరించింది. దీనిపై సాక్షులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిని విచారించిన హైకోర్టు డిసెంబర్‌ 24న వెలువరించిన తీర్పులో టైపింగ్‌ తప్పిదం దొర్లిందని పేర్కొంది. అంతకుముందు తీర్పులో పేర్కొన్న.. ఇప్పటికే 16 ఏళ్ల 10 నెలల పాటు శిక్ష పూర్తయ్యింది. ఇతర కేసుల్లో దోషి అవసరం లేకుంటే విడుదల చేయొచ్చు.. అన్న వాక్యాలను తొలగిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 14న మళ్లీ తీర్పునిచ్చింది. అలాగే, జితేందర్‌ను అరెస్టు చేయాలని, సాక్షులకు రక్షణ కల్పించాలని ఆదేశించింది. కాగా, జితేందర్‌ విడుదలైనప్పటి నుంచి పరారీలో ఉన్నాడు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అలా అయితే పాకిస్తాన్‌కు సాయం చేస్తాం: కేంద్రమంత్రి

నివురుగప్పిన నిప్పులా అసమ్మతి!

నడుస్తున్న బస్సులో కునుకు తీసిన డ్రైవర్‌

హృదయాలను పిండేసిన శుభశ్రీ మరణం

ఢిల్లీ వర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ హవా

వదంతులకు పుల్‌స్టాప్‌ పెట్టండి

జరిమానాలపై జనం బెంబేలు

‘ఎస్సీ, ఎస్టీ’ తీర్పుపై సమీక్షకు ఓకే

శివకుమార్‌ కస్టడీ పొడిగింపు

పరువు తీసుకున్న ఇమ్రాన్‌ ఖాన్‌

ఇకనైనా మీరే పన్ను కట్టండి

చిదంబరానికి ఢిల్లీ కోర్టు షాక్‌!

తేజస్‌ ‘అరెస్టెడ్‌ ల్యాండింగ్‌’ సక్సెస్‌

‘విక్రమ్‌’తో సంబంధం కష్టమే!

‘హమ్‌సఫర్‌’ ఫ్లెక్సీ ఫేర్‌ తొలగింపు

ఎస్‌ఐని చితకబాదిన మహిళలు

కేంద్ర ఎన్నికల సంఘంతో టీఆర్‌ఎస్‌ ప్రతినిధుల భేటీ

ఈనాటి ముఖ్యాంశాలు

ఎద్దు కడుపులో బంగారు మంగళసూత్రం

పొరపాటుగా మాట్లాడానూ.. అంత మాత్రానే..

‘గేమ్‌పై ఫోకస్‌ లేకుంటే ఇలాగే మాట్లాడతారు’

మరో 5 రోజులు డీకే రిమాండ్‌ కోరిన ఈడీ..

కన్నీటితో మెట్టినింటిని వీడిన ఐశ్వర్య..

రాజధానిలో ఆ విధానం అవసరం లేదు..

వైరల్‌ : రోడ్లమీద​కు వచ్చేసిన సింహాల గుంపు

జాబ్స్‌ కోసం యువత భారీ ర్యాలీ..

భారత ఆర్థిక వ్యవస్థపై ‘సహస్రాబ్ది జోక్‌’

సుప్రియాను వేధించిన ట్యాక్సీ డ్రైవర్‌

గణేష్‌ నిమజ్జనం: 28మంది దుర్మరణం

స్వామిపై లైంగిక దాడి కేసు : సిట్‌ విచారణ ముమ్మరం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నయన పెళ్లెప్పుడు?

వదంతులకు పుల్‌స్టాప్‌ పెట్టండి

బందోబస్త్‌ సంతృప్తి ఇచ్చింది

సరికొత్త యాక్షన్‌

గెటప్‌ చేంజ్‌

పండుగాడు వస్తున్నాడు