'నెహ్రూ లేకుంటే ఆ ప్రయోగాలు సాధ్యపడేవి కావు'

13 Nov, 2014 14:31 IST|Sakshi
'నెహ్రూ లేకుంటే ఆ ప్రయోగాలు సాధ్యపడేవి కావు'
న్యూఢిల్లీ: పండిట్ జవహర్ లాల్ నెహ్రూ లేకుంటే చంద్రయాన్, మంగళ్ యాన్ లాంటి ప్రయోగాలు సాధ్యపడేవి కాదు అని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు.  దేశరాజధానిలోని తల్కొటోరా స్టేడియంలో ప్రారంభమైన భారత మొదటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 125వ జయంతి ఉత్సవాల్లో సోనియా మాట్లాడుతూ.. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకున్నాం. అంతేకాకుండా మన నేతల నుంచి సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్చుకున్నాం అని అన్నారు. 
 
సిద్దాంతాలకు, సాంప్రదాయాలకు కట్టుబడి ఉన్నామని సోనియా తెలిపారు. జాతి పునర్ నిర్మాణంలో కాంగ్రెస్ పాత్ర గర్వించదగినదని ఆమె అన్నారు. భారత దేశ ఐక్యతకు నెహ్రూ విజన్ ఉపయోగపడిందని సోనియా అభిప్రాయపడ్డారు. దేశ పురోగతిని, స్వేచ్చను హరించాలని చూస్తున్న దుష్ట శక్తులతో పోరాటం చేస్తామని సోనియా తెలిపారు. 
మరిన్ని వార్తలు