ఉద్యోగినులపై చానల్‌ సీఈవో లైంగిక వేధింపులు

14 Mar, 2017 09:16 IST|Sakshi
ఉద్యోగినులపై చానల్‌ సీఈవో లైంగిక వేధింపులు
ముంబై : ఓ ప్రఖ్యాత యూ ట్యూబ్‌ ఛానల్ కు సీఈవోగా ఉ‍న్న ఓ ప్రబుద్ధుడు తమ సంస్థలో పనిచేస్తున్న మహిళా  ఉద్యోగులను లైంగికంగా వేధిస్తూ చిత్రహింసలు పెడుతున్నాడు. ఈ విషయం ఓ మాజీ మహిళా ఉద్యోగి సోషల్ మీడియాలో వివరించడంతో వెలుగులోకి వచ్చింది.  
 
ఆన్ లైన్ డిజిటల్ ఎంటర్ టైన్ మెంట్ ఛానల్స్ లో దేశంలోనే ఒకటిగా నిలుస్తున్న ది వైరల్ ఫీవర్(టీవీఎఫ్) వ్యవస్థాపకుడు, సీఈవో అరునబ్ కుమార్ తనను లైంగికంగా వేధింపులకు గురిచేశాడని ఓ మాజీ మహిళ ఉద్యోగి  ఆరోపించింది. ఈ విషయాన్ని ఆ మహిళా ఉద్యోగి 'ది ఇండియన్ ఉబర్- దట్ ఈజ్ టీవీఎఫ్' పేరుతో సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఆ సంస్థలో పనిచేసిన రెండేళ్లపాటు వివిధ సందర్భాల్లో అరునబ్ కుమార్ తనను చేసిన లైంగిక వేధింపులను ఆ మహిళ పూసగుచ్చినట్టు వివరించింది.
 
ముంబాయి కేఫ్ లో కుమార్ ను కలుసుకున్నట్టు, ఇద్దరిది బిహార్ లోని ముజాఫర్ పుర్ కావడంతో వెంటనే తనతో సన్నిహితం ఏర్పడిందని తెలిపింది. తమ స్టార్టప్ లో జాయిన్ అవ్వాలని తనకు అరునబ్ సూచించాడని, అక్కడ జాయిన్ అయిన 21 రోజుల నుంచే తనపై కుమార్ లైంగిక వేధింపులు ప్రారంభించాడని పేర్కొంది. అక్కడి నుంచి రెండేళ్ల పాటు తాను చీకటి జీవితంలోనే బతికినట్టు తెలిపింది.
 
పార్టీల్లో అసభ్యకరంగా ప్రవర్తించడం, మద్యం మత్తులో ఇష్టమొచ్చినట్లు వ్యవహరించడం వంటివి చేసేవాడని వివరిస్తూ తనపై జరిగిన లైంగిక వేధింపులను వెలుగులోకి తెచ్చింది. కనీసం పోలీసుల సహాయం కోరడానికి కూడా లేకుండా వారిని కూడా తన గుప్పిట్లో పెట్టుకున్నట్టు అరునబ్ బెదిరించేవాడనే విషయాన్ని తెలిపింది.  ఈ విషయాలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన వెంటనే ఈ పోస్టు వివపరీతంగా వైరల్ అయింది. ఆమెతో పాటు మరో ఇద్దరు మహిళా ఉద్యోగులు కూడా తమను కూడా ఈ రకంగానే అరునబ్ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడంటూ వివరించారు. ఈ స్టార్టప్ కూడా తమ వేధింపు ఆరోపణలను పట్టించుకోవడం లేదని మహిళా ఉద్యోగి ఆరోపించింది. అయితే ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలేనని టీవీఎఫ్ కొట్టిపారేస్తోంది. టీవీఎఫ్ సేఫ్ వర్కింగ్ ప్లేస్ అంటూ గొప్పలు చెప్పుకుంటోంది. మహిళలకు, పురుషులకు సౌకర్యవంతమైన జోన్ గా చెబుతోంది. .   
మరిన్ని వార్తలు