వేరొక మహిళతో కారులో భర్త.. రోడ్డుపైనే..

13 Jul, 2020 15:41 IST|Sakshi

భర్తపై అనుమానంతో నడిరోడ్డుపైనే వాగ్వాదం

ముంబై: తన భర్త వేరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో ఓ మహిళ నడిరోడ్డుపైనే వాగ్వాదానికి దిగింది. అతడి కారును వెంబడించి మార్గమధ్యలోనే ఆపేసింది. బానెట్‌పైకి ఎక్కి అతడిని ముందుకు సాగకుండా అడ్డుకుంది. వీరి గొడవ కారణంగా కాసేపు వాహనాలు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్‌ పోలీసులు రంగంలోకి దిగి భార్యాభర్తలను పోలీసు స్టేషనుకు తీసుకువెళ్లారు. ముంబైలోని పెడెర్‌ రోడ్డులో శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వివరాలు.. ముంబైకి చెందిన ఓ వివాహిత గత కొంతకాలంగా తన భర్తపై అనుమానం పెంచుకుంది. (వీడియో చూస్తే మీరూ ఆశ్చర్యపోవాల్సిందే!)

ఈ క్రమంలో శనివారం అతడు మరో మహిళతో కలిసి తన రేంజ్‌ రోవర్‌ కారులో బయటకు వెళ్లడం గమనించింది. వెంటనే తాను మరో కారులో వారిని వెంబడించింది. పెడెర్‌ రోడ్డులో భర్త కారును ఆపేసి.. గట్టిగా కేకలు వేస్తూ అతడిని కిందకు దింపేందుకు ప్రయత్నించింది. అనంతరం బానెట్‌ పైకి ఎక్కి చెప్పుతో కొడుతూ ఆవేదన వెళ్లగక్కింది. భర్త కారు నుంచి దిగగానే అతడిని తన్నుతూ ఆగ్రహం ప్రదర్శించింది. ఇంతలో కారులో ఉన్న మహిళ డ్రైవింగ్‌ చేస్తూ తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. సదరు వివాహిత తన కారులో ఆమెను వెంబడించింది. సిగ్నల్‌ దగ్గర ఆమె కారు ఆగగానే కిందకు లాగి దాడి చేసేందుకు యత్నించింది. ఈ నేపథ్యంలో ఇతర వాహనదారులకు ఇబ్బందులు తలెత్తడంతో ట్రాఫిక్‌ పోలీసులు వీరిని మందలించారు. రోడ్డుపై వీరంగం సృష్టించారంటూ సదరు వివాహితకు చలాన్‌ విధించారు. అనంతరం ముగ్గురిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళ్లి కౌన్సిలింగ్‌ ఇచ్చారు.(కోడి పిల్లలు అనుకుంటే పొరపాటే.. )

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు