మృత్యుంజయురాలు

4 Jul, 2016 09:03 IST|Sakshi
మృత్యుంజయురాలు

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ వరదల కారణంగా చిన్నాభిన్నపరిస్థితులు ఏర్పడి దయనీయంగా మారిన పితోర్ ఘడ్ జిల్లాలో అద్భుతం చోటుచేసుకుంది. రెండు రోజులపాటు శిథిలాలకింద ఇరుక్కుపోయిన మహిళ ప్రాణాలతో బయటపడింది. అసోం రైఫిల్స్ కు చెందిన సైనికులు ఆమెను ప్రాణాలతో రక్షించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు ఆన్ లైన్లో హల్ చల్ చేస్తోంది.

గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు, వరదల కారణంగా ఉత్తరాఖండ్ లోని పితోర్ ఘడ్ జిల్లా తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వందల ఇళ్లు నేలమట్టంకాగా.. వేల సంఖ్యలో జనాలు మరోసారి తమ నివాసాలను వదిలి వెళ్లారు. ఈ క్రమంలోనే పితోర్ ఘడ్ జిల్లాలోని బస్తాది గ్రామంలో ఓ నివాసం కుప్పకూలిపోయింది. అందులో ఓ మహిళ ఇరుక్కుపోయింది. రెండు రోజులపాటు ఆమె ఆ శిథిలాల కింద ఉండిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో సహాయ చర్యలు చేపట్టిన అసోం రైఫిల్స్ విభాగం ఆమెను రక్షించి ఆస్పత్రికి తరలించింది. ఈ వీడియోను ఇప్పటికే రెండున్నర లక్షలమంది వీక్షించారు.

మరిన్ని వార్తలు