'ఒక్కరే కాదు...ఇద్దరు భరించాలి'

16 Feb, 2015 12:39 IST|Sakshi

ముంబై: ఇంటి కోసం ప్రతినెలా కట్టాల్సిన ఈఎంఐ మొత్తాన్ని తన భర్తే చెల్లించాలని ఓ భార్య వేసిన పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. వివరాల్లోకి వెళితే నెల నెలా హోంలోన్ ఈఎంఐని  తన భర్త ఒక్కరే చెల్లించాలని ఓ భార్య ముంబయి ఫ్యామిలీ కోర్టులో కేసు వేసింది. ఇంటి ఖర్చులకు నెలకు రూ. 90 వేలు భర్త చెల్లించాలని ఆమె అందులో పేర్కొంది.

అయితే ఈ కేసును కోర్టు సోమవారం తిరస్కరించింది. భర్తకు అనుకూలంగా తీర్పునిచ్చింది. కుటుంబంలోని భార్యాభర్తలు ఇద్దరూ కలిసి డబ్బులు చెల్లించాలని, ఒక్కరిపైనే భారం పడకూడదని కోర్టు ఆదేశించింది. 'సాధారణంగా ఆస్తులు పురుషుల పేరిట ఉంటాయి. కానీ ప్రస్తుతం మహిళలకు కూడా సమాన ప్రాతినిధ్యం కావాలంటున్నారు. అందువల్ల ఇద్దరు చెల్లిస్తే ఎలాంటి సమస్య ఉండదు' జడ్జి తెలిపారు. కాగా కోర్టును ఆశ్రయించిన మహిళ తన కుమార్తెతో కలిసి భర్తలో కలిసి ఉంటుంది.

మరిన్ని వార్తలు