సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం

13 Aug, 2016 22:52 IST|Sakshi

మథుర: ఢిల్లీ- ఆగ్రా రహదారిపై శనివారం ఓ మహిళ మృతదేహం ఉన్న సూట్‌కేసు కలకలం సృష్టించింది. రహదారికి సమీపంలోని ఓ కాలువ పక్కన ఈ సూట్‌కేస్‌ను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సూట్‌కేస్ తెరిచి చూడగా అందులో అర్ధనగ్నంతో ఉన్న మహిళ మృతదేహం కనిపించిందని ఎస్పీ అలోక్ ప్రియదర్శిని తెలిపారు.

మృతురాలికి 35 ఏళ్లు వయసుంటుందని, శరీరంపై అక్కడక్కడ గాయాలు ఉన్నాయని చెప్పారు. మహిళను వేరేచోట హతమార్చి.. అనంతరం మృతదేహాన్ని ఇక్కడ పడేసి ఉండొచ్చని ఎస్పీ అనుమానం వ్యక్తం చేశారు.
 

మరిన్ని వార్తలు