వీడియోతో బుద్ధి చెప్పింది...

8 Feb, 2015 16:23 IST|Sakshi
వీడియోతో బుద్ధి చెప్పింది...

స్త్రీలపై వేధింపులు రోజుకోజుకు ఎక్కువ అవుతున్నాయే తప్ప తగ్గడం లేదు. బస్సులు, రైళ్లలోనే కాదు...విమానాల్లో కూడా వేధింపులు తప్పటం లేదు.  తాజాగా అటువంటి సంఘటనే మరొకటి జరిగింది.  ఈసారి ఏకంగా విమానంలోనే ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది.  వివరాల్లోకి వెళితే... జార్ఖండ్కు చెందిన ఓ యువతి ప్రయాణికురాలు ఇండిగో విమానంలో భువనేశ్వర్ వెళ్తుంది.  

ఆమె వెనుక సీటులో ఓ వ్యక్తి కూర్చున్నాడు. చూడడానికి డీసెంట్గా ఉన్నా...బుద్ధి మాత్రం గడ్డి తింది. సీట్ల మధ్యలో ఉన్న గ్యాప్ నుంచి ఆ యువతిని తాకడానికి ప్రయత్నించాడు.  దీంతో విసిగిపోయిన ఆమె ధైర్యం కూడదీసుకుని అతని ఫొటోతో పాటు అక్కడ జరుగుతున్న సంఘటనను కొద్దిసేపు వీడియో తీసింది.

ఆ తర్వాత ఒక్కసారిగా కేకలు వేసింది.. అరుపులు విన్న విమాన సిబ్బంది, తోటి ప్రయాణికులు ఆ యువతికి అండగా నిలిచారు. తోటివారి సహాయంతో ఆమె ఎయిర్ పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సాధారణంగా ఎవరైనా అఘాయిత్యానికి పాల్పడితే మహిళలు ప్రతిఘటించడానికి భయపడతారు. కానీ అలా చేయడం కూడా నేరం అనేది తన అభిప్రాయమని ఆమె పేర్కొంది.  

తన విషయానికి వస్తే చట్టాలు ఏం చేయలేవని నాకు తెలుసు అందుకే అందరి ముందు అతడిని అవమానం జరగాలని భావించి గట్టిగా అరిచానని' యువతి తెలిపింది.  కాగా సదరు 'పెద్ద' మనిషి భువనేశ్వర్కు చెందిన పలు కంపెనీలకు ఛైర్మన్.  అయితే  జున్జున్వాలా పోలీసులు మాత్రం అతడిని కొద్దిసేపు కస్టడీలోకి తీసుకుని వదిలేయటం గమనార్హం.

>
మరిన్ని వార్తలు