వైర‌ల్‌: మ‌ంచంలో త‌ల్లిని రోడ్డుపై లాక్కు వెళుతూ

15 Jun, 2020 08:19 IST|Sakshi

ఒడిశా: త‌న‌ త‌ల్లి బ్యాంకు ఖాతాలో ప్ర‌భుత్వం జ‌మ చేసిన న‌గ‌దు తీసుకు‌నేందుకు మంచాన ప‌డ్డ త‌ల్లిని ఓ మ‌హిళ బ్యాంకు వ‌ర‌కు లాక్కెళ్లింది. ఈ విషాద ఘ‌ట‌న ఒడిశాలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. నౌపారా జిల్లాకు బార్గావున్‌కు చెందిన‌ పుంజీమ‌తి దేవి త‌ల్లి బ్యాంకు ఖాతాలో ప్ర‌భుత్వం రూ.1500 జ‌మ చేసింది. ఈ మొత్తాన్ని తీసుకునేందుకు స‌ద‌రు మ‌హిళ జూన్ 9న ఉత్క‌ల్ గ్రామీణ‌ ‌బ్యాంకుకు వెళ్లింది. అయితే ఖాతాదారు ఉంటేనే డ‌బ్బులు ఇస్తామ‌ని బ్యాంకు మేనేజర్ అజిత్ ప్ర‌ధాన్‌ తేల్చి చెప్పాడు. (హృదయ విదారకం : స్నేహితుడికి గుర్తుగా)

దీంతో ఆమె గత్యంత‌రం లేని ప‌రిస్థితిలో మంచాన ప‌డ్డ వందేళ్ల వ‌య‌సున్న త‌ల్లిని బ్యాంకు వ‌ర‌కూ లాక్కుంటూ వెళ్లింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఈ ఘ‌ట‌న‌పై జిల్లా క‌లెక్ట‌ర్ మ‌ధుస్మిత సాహో స్పందిస్తూ... "బ్యాంకు మొత్తాన్ని ఒక‌రే నిర్వ‌హిస్తున్నారు. అందువ‌ల్ల అదే రోజు ఆమె ఇంటికి వెళ్ల‌డం బ్యాంకు మేనేజ‌ర్‌కు కుద‌ర‌లేదు. కాబ‌ట్టి త‌ర్వాతి రోజు బ్యాంకు స‌ద‌రు మ‌హిళ ఇంటికి వ‌స్తాన‌ని భ‌రోసా ఇచ్చాడు. కానీ ఆమె వినిపించుకోకుండా త‌ల్లిని మంచంలో వేసి లాక్కుని వెళ్లింది" అని తెలిపారు. ఎట్ట‌కేల‌కు ఆమె డ‌బ్బులు విత్‌డ్రా చేసుకుంద‌ని తెలిసింది. (3 లక్షల జన్‌ధన్‌ ఖాతాల నుంచి డబ్బులు వెనక్కి)

మరిన్ని వార్తలు