పెళ్లైన 9 ఏళ్ల‌కు అమ్మాయి కాద‌ని తెలిసింది

26 Jun, 2020 14:23 IST|Sakshi

కోల్‌క‌తా: సాఫీగా సాగిపోతున్న జీవితంలో ఓ మ‌హిళ‌కు అక‌స్మాత్తుగా షాకింగ్ నిజం తెలిసింది. క‌డుపు నొప్పితో ఆస్ప‌త్రికి వెళితే ఆమె "అత‌డు" అని తేలింది. ఈ విచిత్ర ఘ‌ట‌న కోల్‌క‌తాలో చోటు చేసుకుంది. కోల్‌క‌తాలోని బీర్‌భ‌మ్‌కు చెందిన ముప్పై యేళ్ల మ‌హిళ క‌డుపు నొప్పితో కొద్ది నెల‌ల క్రితం నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ క్యాన్స‌ర్ ఆస్ప‌త్రికి వెళ్లింది. వైద్యులు ఆమెను ప‌రీక్షించ‌గా.. టెస్టిక్యుల‌ర్(వృషణ‌) క్యాన్స‌ర్ బారిన ప‌డిన‌ట్లు తెలిసింది. దీంతో పాటు మ‌రో‌‌ షాకింగ్ నిజం తెలిసింది. మెడిక‌ల్ రిపోర్టులో ఆమె పురుషుడ‌ని తేలింది. సాధార‌ణంగా మ‌హిళ‌ల్లో XX క్రోమోజోములు ఉంటాయి. కానీ, ఆమెలో మాత్రం పురుషుని వ‌లె XY క్రోమోజోములు ఉన్నాయి. (కరోనాకు భారతీయ మహిళలే ఎక్కువగా బలి!)

ఈ విష‌యం గురించి ఆమెను ప‌రీక్షించిన వైద్యులు డా.దత్త మాట్లాడుతూ.. "ఆమె చూడ‌టానికి అచ్చంగా మ‌హిళ‌లాగే క‌నిపిస్తుంది. గొంతుతో పాటు అన్ని అవ‌య‌వాలు అమ్మాయిలానే ఉంటాయి. శ‌రీరంలోనూ మ‌హిళ‌ల్లో ఉండే అన్ని హార్మోన్లు ఉన్నాయి. వీటివ‌ల్లే ఆమెకు స్త్రీ రూపం వ‌చ్చింది. అయితే ఆమెలో పుట్టుక‌తోనే గ‌ర్భాశ‌యం, అండాశ‌యం లేవు. దీని వ‌ల్ల స‌ద‌రు మ‌హిళ‌కు ఇప్ప‌టికీ రుతుస్రావం జ‌ర‌గ‌లేదు. ఇలాంటి సంఘ‌ట‌న‌లు చాలా అరుదు. 22 వేల మందిలో ఒక్క‌రికి ఇలా జ‌రుగుతుంది" అని తెలిపారు. (10 ఏళ్ల గ్యాప్‌తో కవలల జన్మ)

ప్ర‌స్తుతం ఆమెకు కీమోథెర‌పీ చేస్తున్నామ‌ని, ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని పేర్కొన్నారు. కాగా ఆమె పెళ్లి చేసుకుని 9 సంవ‌త్స‌రాలు అవుతుండ‌గా వీరికి పిల్ల‌లు లేరు. దీని గురించి ఆమెకు, ఆమె భర్త‌కు కౌన్సెలింగ్ ఇస్తున్నా‌మ‌ని వైద్యులు తెలిపారు. మ‌రో ఆశ్చ‌ర్యక‌ర‌మైన విష‌యం ఏంటంటే ఆమె 28 ఏళ్ల సోద‌రికి "ఆండ్రోజెన్ ఇన్‌సెన్సిటివిటీ సిండ్రోమ్" ఉన్న‌ట్లు నిర్ధార‌ణ అయింది. అంటే జ‌న్యుప‌రంగా అబ్బాయిలా జ‌న్మించిన‌ప్ప‌టికీ, పైకి మాత్రం అమ్మాయిలాగే క‌నిపిస్తుంది. వీరి ర‌క్త సంబంధీకుల్లో ఇద్ద‌రికి ఇలాంటి వ్యాధి ఉండ‌టం వ‌ల్లే జ‌న్యువుల ద్వారా వీరికి వ్యాపించింద‌ని డా. ద‌త్త‌ తెలిపారు. (కన్నీటితో కడుపు నింపలేక.. )

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు