పోలీసులపై దౌర్జన్యం.. మహిళ అరెస్టు

31 Dec, 2015 10:41 IST|Sakshi

ఓ పోలీసుతో పాటు మహిళా కానిస్టేబుల్ మీద కూడా దాడి చేసిన కేసులో గోవా పోలీసులు ఓ మహిళను అరెస్టు చేశారు. ఫరీదా బీ (35) అనే మహిళ ఫిర్యాదు చేసేందుకు పోలీసు స్టేషన్‌కు వెళ్లి అక్కడ గందరగళం సృష్టించిందని ఇన్‌స్పెక్టర్ సిద్ధాంత్ శిరోద్కర్ తెలిపారు. సరిగా ప్రవర్తించాలని చెప్పినందుకు తనతో పాటు మరో మహిళా కానిస్టేబుల్‌ను కూడా ఆమె తోసిపారేసిందని ఆయన చెప్పారు. పోలీసుస్టేషన్‌లో ఆమె చేసిన హడావుడి మొత్తం లోపలున్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యిందన్నారు.

స్థానిక యువకుడిపై ఫిర్యాదు చేయడానికి ఆమె స్టేషన్‌కు వెళ్లింది. తర్వాత ఓ ఎస్ఐని విచారణకు పంపినా ఆమె సంతృప్తి చెందలేదు. మళ్లీ పోలీసు స్టేషన్‌కు వచ్చి.. దర్యాప్తు సక్రమంగా లేదని చెబుతూ పోలీసులపై ఆరోపణలు చేసింది. తర్వాత వాగ్వాదం చోటుచేసుకుని ఇన్‌స్పెక్టర్, మహిళా కానిస్టేబుళ్లను తోసేసింది. ఆమెపై ఐపీసీ సెక్షన్లు 353, 427, 504 కింద కేసు పెట్టారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు