వైరల్‌ : జీన్స్‌ ధరించిన యువతికి బెదిరింపులు

25 Jun, 2018 09:18 IST|Sakshi

కోల్‌కతా : కోల్‌కతా నగరంలోని  రైళ్లలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. గతంలో ఓ జంట కౌగిలించుకున్నారని ఆరోపిస్తూ అల్లరిమూక దాడికి దిగిన సంగతి తెలిసిందే. తాజాగా జీన్స్‌ ధరించిన యువతి వస్త్రధారణను తప్పుపడుతూ ఓ వ్యక్తి ఆమెపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఆమె స్నేహితుడితో కూడా మాటల దాడికి దిగారు. ఈ ఘటనను ఆమె తన మొబైలో చిత్రీకరించిడంతో పాటు తనపై జరిగిన దాడికి సంబంధించి ఫేస్‌బుక్‌లో వివరించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై ఆ యువతి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

24 ఏళ్ల యువతి తన స్నేహితుడితో కలసి శనివారం రాత్రి బారక్‌పూర్‌ వెళ్లేందుకు సీల్దా స్టేషన్‌లో లోకల్‌ ట్రైన్‌ ఎక్కారు. వారిద్దరు ఒకే దగ్గర కూర్చోవడానికి వీలుగా ఓ వ్యక్తిని కొంచెం పక్కకు జరగాల్సిందిగా కోరారు. కానీ ఆ వ్యక్తి అందుకు నిరాకరించడంతో వారు ఉన్న స్థలంలోనే సర్దుకుని కూర్చున్నారు. వారు అలా కూర్చోవడాన్ని తప్పుబట్టిన సదరు వ్యక్తి వారితో వాగ్వాదానికి దిగాడు. ఇంతలో అక్కడికి చేరుకున్న మరో వ్యక్తి వారి మధ్య జోక్యం చేసుకున్నాడు. ఆ యువతి టీ షర్ట్‌, జీన్స్‌ ధరించడంపై అభ్యంతరం తెలిపాడు. ఆమె వస్త్రధారణపై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డాడు. అంతేకాకుండా బెదిరింపులకు కూడా దిగాడు. 

ఈ ఘటనపై ఆ యువతి స్పందిస్తూ.. ‘మన దేశంలో స్త్రీలు ఇంకా ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి రావడం బాధకరం. బస్సులో, రైళ్లలో ఈ రకమైన ఘటనలు రోజు జరుగుతూనే ఉన్నాయి. తమకంటే పెద్దవారి నుంచి ఇలాంటి ప్రవర్తనను తాము కోరుకోవడం లేదు’  అని తెలిపారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా