ఎయిర్ పోర్టులో బుల్లెట్ల కలకలం.. తల్లీకూతుళ్ల అరెస్ట్

5 Mar, 2016 17:10 IST|Sakshi
ఎయిర్ పోర్టులో బుల్లెట్ల కలకలం.. తల్లీకూతుళ్ల అరెస్ట్

పశ్చిమ బెంగాల్ లో ఇద్దరు విదేశీ మహిళలు బుల్లెట్లతో సంచరిస్తూ కలకలం సృష్టించారు. కోల్ కతా లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అనుమానితులుగా గుర్తించి ఇద్దరు మహిళలను ఎయిర్ పోర్టు అధికారులు అరెస్ట్ చేశారు. ఇద్దరు మహిళల లగేజీని పూర్తిగా పరిశీలించగా వారి వద్ద కొన్ని బుల్లెట్లు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. మొదటగా వారి హ్యాండ్ బ్యాగ్స్ స్కాన్ చేయగా ఎదో ఉన్నట్లు అనుమానం వచ్చి, లగేజీని పూర్తిగా చెక్ చేయడంతో వారి వద్ద బుల్లెట్లు ఉన్నట్లు గుర్తించామని వారిద్దరూ తల్లీకూతుళ్లు అని అధికారులు వెల్లడించారు.

నేతాజీ ఎయిర్ పోర్టు నుంచి ఎమిరేట్స్ విమానంలో వారు దుబాయ్ కి వెళ్లి, అక్కడి నుంచి ఇటలీకి వెళ్లనున్నట్లు ఆ మహిళలు చెప్పారని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. ఆ తల్లీకూతుళ్లు ఫ్రాన్స్ కు చెందిన వారిని, ప్రస్తుతం వారిని విచారణ చేస్తున్నట్లు వివరించారు. వారి వద్ద నుంచి 5 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు