బురదతో మహిళల హోలీ!

24 Mar, 2016 11:10 IST|Sakshi
బురదతో మహిళల హోలీ!

హోలీ అంటే రంగుల పండుగ. పసుపు, గులాబి, ఎరుపు, ఆకుపచ్చ.. ఇలా సప్తవర్ణాలు ముఖాల మీద పులుముకొని ఆడుకోవడం మనకందరికీ తెలుసు. కానీ ఒకే ఒక్క రంగుతో హోలీ ఆడటం ఎప్పుడైనా చూశారా? అది కూడా బురదతో!! అవును.. రాజస్థానీ మహిళలు హోలీని చాలా విభిన్నంగా చేసుకున్నారు. కెమికల్ రంగులతో పాటు ఆర్గానిక్ రంగులు కూడా అక్కర్లేదని చెబుతూ.. ప్రకృతి వైద్య  చికిత్సగా భావించే మడ్ బాత్‌ను తలపించేలా బురద మట్టితో స్నానాలు చేస్తూ హోలీ పండుగను నిర్వహించారు. అందరికీ భిన్నంగా మట్టిని స్విమ్మింగ్ పూల్ గా మార్చుకొని హోలీ సంబరాలు జరుపుకున్నారు.

ప్రకృతి చికిత్సా విధానంలో చర్మవ్యాధులు, చుండ్రు వంటి వ్యాధులను తగ్గించేందుకు, శరీరంలోని మలినాలను తొలగించేందుకు బురదతో చికిత్స అందిస్తుంటారు. రేగడి మట్టిని మెత్తగా బురదలా చేసి తలనుంచి పాదాల వరకూ పట్టించి, ఆరిన తర్వాత స్నానం చేయిస్తారు. ఇలా చేయడం వల్ల ముఖ్యంగా వేసవిలో శరీరంలోని ఉష్ణతాపం వల్ల వచ్చే చెమట, మలినాలు బయటకు వచ్చి, చర్మవ్యాధులుంటే నశిస్తాయి. ప్రస్తుతం ఉదయపూర్ మహిళలు ఇదే పద్ధతిని హోలీతో రంగరించారు. చిన్నా పెద్దా కేరింతల మధ్య బురదలో మునిగితేలారు.

మరిన్ని వార్తలు