రైళ్లలో మహిళా పటాలం

9 Dec, 2014 01:36 IST|Sakshi

న్యూఢిల్లీ: రైళ్లలో మహిళా ప్రయాణికుల రక్షణ కోసం త్వరలో మహిళా పోలీసులు రంగంలోకి దిగనున్నారు.  రైల్వే రక్షక దళం మహిళా బెటాలియన్(పటాలం)ను ఏర్పాటు చేయనున్నట్లు ఆ శాఖ మంత్రి సురేష్ ప్రభు సోమవారం లోక్‌సభలో వెల్లడించారు. వేధింపులపై మహిళా ప్రయాణికులు ఫిర్యాదు చేసేందుకు ఓ అప్లికేషన్‌ను ప్రారంభిస్తామని తెలిపారు. ప్రయాణికుల కార్యకలాపాలను గమనించేందుకు రైళ్లలో సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. మరోవైపు, రైళ్లలో ప్రయాణికులకు కనీస వసతులు కూడా లేవని ఆ శాఖ అంగీకరించింది. దూర ప్రాంత రైళ్లు కొన్నింటిలో నాణ్యతలేమి ఆహారం సరఫరాపై ఫిర్యాదులు వచ్చినట్లు ఆ శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. అపరిశుభ్ర పరిస్థితులు, బొద్దింకలు, లైట్లు వెలగకపోవడం, ఆహారం తదితర వసతులకు సంబంధించి 2012 ఏప్రిల్ నుంచి 2014 అక్టోబర్ మధ్య 5,670 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు.
 
 పార్లమెంటు సమాచారం కుప్లంగా..
 -    ఉద్యోగుల భవిష్యనిధి లావాదేవీల్లో ఆధార్ నెంబర్ ఇవ్వడాన్ని తప్పనిసరి చేయలేదని కార్మిక మంత్రి దత్తాత్రేయ బదులిచ్చారు.
  ళీఉపాధీ హామీ కూలీలకు నిధుల చెల్లింపుల్లో పోస్టాఫీసుల్లో దళారుల పాత్ర తమ దృష్టికి వచ్చిందదని, దీని నివారించేందుకు ఏపీ, తెలంగాణ, జార్ఖండ్‌లో బయోమెట్రిక్ విధానాన్ని ప్రతిపాదించామని కేంద్రం పేర్కొంది.
 -    దేశంలో 24 శాతం గృహాలు సురక్షితం కాని మంచినీటితో కాలం వెళ్లదీస్తున్నాయని కేంద్ర మంత్రి బీరేంద్రసింగ్ తెలిపారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా