బుర్ఖా బంద్‌.. అతిక్రమిస్తే రూ.250 ఫైన్‌..!

25 Jan, 2020 15:15 IST|Sakshi

పట్నా : దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పట్నాలోని ఓ మహిళా కళాశాల నిర్వాకం చర్చనీయాంశమైంది. ముస్లిం విద్యార్థినిలు బుర్ఖా ధరించి కళాశాలకు రావొద్దని జేడీ మహిళా కాలేజీ హుకుం జారీ చేసింది. దాంతోపాటు తప్పని సరిగా డ్రెస్‌ కోడ్‌ పాటించాలని కాలేజీ యాజమాన్యం నోటీసులో పేర్కొంది. సోమవారం నుంచి శుక్రవారం డ్రెస్‌కోడ్‌ తప్పనిసరని.. నిబంధనలు అదిక్రమిస్తే రూ.250 పెనాల్టీ విధిస్తామని స్పష్టం చేసింది.
(చదవండి : బురఖా బ్యాన్‌పై వెనక్కి తగ్గిన సంజయ్‌)

శనివారం ఒక్కరోజు డ్రెస్‌కోడ్‌ నుంచి మినహాయింపునిస్తున్నామని నిర్వాహకులు నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, మేనేజ్‌మెంట్‌ తీరుపై విద్యార్థినిలు ఈరోజు (శనివారం) నిరసనకు దిగారు. నోటీసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంపై మీడియా ప్రతినిధులు కాలేజీ ప్రిన్సిపల్‌ శ్యామా రాయ్‌ని వివరణ కోరగా.. నోటీసులను ఉపసంహరించుకుంటున్నామని చెప్పారు.

>
మరిన్ని వార్తలు