‘శని’ గుడికొస్తే రేప్‌లు పెరుగుతాయి

12 Apr, 2016 02:07 IST|Sakshi
‘శని’ గుడికొస్తే రేప్‌లు పెరుగుతాయి

మహిళలకు అనుమతి వల్లే కేరళ విషాదం: స్వరూపానంద
 
 డెహ్రాడూన్: మహిళలు మహారాష్ట్రలోని శని శింగనాపూర్ ఆలయంలోకి వెళ్లడం వారికే ప్రమాదమనీ, దీని వల్ల స్త్రీలపై అత్యాచారాలు పెరుగుతాయని ద్వారక-శారద పీఠాధిపతి శంకరాచార్య స్వరూపానంద సరస్వతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్త్రీలు గుడిలోకి ప్రవేశం పొందడాన్ని విజయంగా భావించకూడదని ఆదివారం హరిద్వార్‌లో అన్నారు. ఆడవారు ఈ విజయంతో పొంగిపోకుండా, మగవారితో మత్తుపదార్థాల వాడకాన్ని మాన్పించాలని, వాటివల్లే  పురుషులు స్త్రీలపై ఆకృత్యాలకు పాల్పడుతున్నారన్నారు.

శని శింగనాపూర్ గుడిలోకి మహిళలను అనుమతించడం వల్లే కేరళలోని పుట్టింగల్‌లో ప్రమాదం జరిగిందన్నారు. మహారాష్ట్రలో కరువుకు కారణం సాయిబాబా విగ్రహాలను ఆలయాల్లో ప్రతిష్ఠించి గణేశ్, హనుమంతులను బాబా కాళ్ల దగ్గర ఉంచడమేనని చెప్పారు. కాగా త్రయంబకేశ్వరంలో గర్భగుడిలోకి పురుషులను అనుమతించకూడదని ఏప్రిల్ 3న తీసుకున్న నిర్ణయాన్ని ఆలయాధికారులు ఎత్తివేశారు.

మరిన్ని వార్తలు