'అలా అనడానికి ఇష్టపడను'

27 Mar, 2016 10:29 IST|Sakshi
'అలా అనడానికి ఇష్టపడను'

న్యూఢిల్లీ: ఏవో కొన్ని దురదృష్టకర ఘటనలు జరిగినంత మాత్రాన భారత్‌లో అసహనం రాజ్యమేలుతోందనుకోవాల్సిన అవసరం లేదని ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో సీఐఐ యంగ్ ఇండియా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో  మాట్లాడుతూ.. దాద్రీ , పన్సారే, దభోల్కర్, కల్బుర్గీ, జార్ఖండ్‌లో పశువుల వ్యాపారుల హత్యలను ఖండించారు.

‘ఇలాంటి ఘటనలు దురదృష్టకరం. అలాగని భారత్‌లోని 124 కోట్ల మంది అసహనంతో ఉన్నారనేది సరికాదు’ అని ఆమె పేర్కొన్నారు. భారత్ ను అసహన దేశంగా  పేర్కొనడానికి తాను ఇష్టబోనని అన్నారు. భారతీయ చట్టాలు, రాజ్యాంగం సహనంతో కూడుకున్నదని తస్లీమా  పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు