కోర్టు తీర్పు తర్వాత అయోధ్య ఎలా ఉంది?

15 Nov, 2019 14:11 IST|Sakshi

లక్నో: అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఇప్పుడు అందరి దృష్టి రామ మందిరం నిర్మాణంపై పడింది. మందిరం పనులు ఎప్పుడు ఎలా చేపడతారు.. ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఎప్పట్లో పూర్తవుతాయి? అన్నవిషయాలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యేది సంక్రాంతికా.. లేక శ్రీరామనవమికా అనే విషయంలో స్పష్టత లేకపోయినా అయోధ్యలో సందడి వాతావరణం కనిపిస్తోంది. ఎక్కడ చూసినా సాధువులు, భక్తులతో కోలాహలంగా ఉంది. ఇన్నాళ్లూ ఆలయ నిర్మాణంపై స్థానికుల్లో కొంత సందిగ్ధత నెలకొన్నా సుప్రీం తీర్పు సంతోషాన్ని ఇస్తోందంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అయోధ్యలో వాతావరణమంతా ప్రశాంతగా మారింది. పవిత్ర సరయూ నది తీరంలో ఉన్న రాముడి జన్మస్థలంగా భావించే అయోధ్య పట్టణానికి భక్తులు భారీగా పొటెత్తున్నారు. ఆలయ నిర్మాణానికి కనీసం నాలుగు నుంచి ఐదేళ్ల వరకు పడుతుందని శిల్పులు చెబుతున్నారు. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి అయోధ్య ట్రస్ట్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది.

మరిన్ని వార్తలు