కుతుబ్ షాహీ టూంబ్స్ అభివృద్ధికి నిధులు

28 Feb, 2015 15:30 IST|Sakshi

న్యూఢిల్లీ:   భారతదేశంలోని చారిత్రక నగరాలను  అభివృద్ధి చేస్తామని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ముఖ్యంగా  గోవాలోని చర్చిలు, రాజస్థాన్ లోని అడవుల అభి వృద్ధి ,  గుజరాత్ లోని  రాణి కా వావ్   ప్యాలస్ అభివృద్ధి, లడఖ్ లోని లే హ్ ప్యాలెస్, పంజాబ్ లోని జలియన్ వాలాబాగ్,  కర్నాటక లోని హంపి,  ఉత్తర ప్రదేశ్ లోని  వారణాసి, హైదరాబాద్ లోని కుతుబ్ షాహీ టూంబ్స్ అభివృధ్దికి నిధులు కేటాయిస్తామన్నారు.  వీసా సౌకర్యాలను మెరుగు పర్చిన తరువాత భారతదేశం పర్యాటకపరంగా అభివృద్ధి చెందిందన్నారు.  వివిధ దశల్లో వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని   150   దేశాలకు పెంచుతున్నామని  ఆయన ప్రకటించారు.

మరిన్ని వార్తలు