వరల్డ్‌ ఎమోజీ డే, భావాలెన్నో పలికించొచ్చు

17 Jul, 2020 13:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎమోజీలు అంటే మనం చెప్పకుండానే ఎన్నో భావాలను చిన్న చిన్న బొమ్మల ద్వారా చూపించోచ్చు. ప్రస్తుతం సోషల్‌ మీడియా వినియోగం బాగా పెరుగుతుండటంతో ఎమోజీల వాడకం విపరీతంగా పెరిగింది. కరోనా నేపథ్యంలో అందరూ భౌతిక దూరం పాటించాల్సి రావడంతో ఎన్నో చెప్పలేని భావాలను ఎమోజీల ద్వారా వ్యక్తపరుస్తున్నారు. ఈ ఎమోజీలలో చాలా రకాలు ఉన్నాయి. నవ్వుతున్న ఎమోజీలు, ఏడుస్తున్న ఎమోజీలు, ఎక్కిరించే ఎమోజీలు, ఆశ్చర్యం, ఆనందం, అలక, కోపం, సిగ్గు, బాధ ఇలా రకరకాల ఎమోజీలు ఉన్నాయి. వీటన్నింటిని సందర్భానుసారంగా వాడుతుంటారు. సోషల్‌ మీడియా సంస్థలు కూడా ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు రకరకాల ఎమోజీలను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తెస్తున్నాయి. కరోనా సమయంలోనూ దూరంగా ఉన్న తమ వారికి జాగ్రత్తగా ఉండమని సూచించే కేర్‌ ఎమోజీతోపాటు  మరికొన్నింటిని ఫేస్‌బుక్‌ తీసుకువచ్చింది. 

చదవండి: ఫేస్‌బుక్‌లో కొత్త ఎమోజీ... వివరాలు మీకోసం!

ఈరోజు (జూలై 17) వరల్డ్‌ ఎమోజీ డే సందర్భంగా పలు సంస్థలు రకరకాల ఎమోజీలతో కూడిన పోస్ట్‌లతో తమ ట్విటర్‌ అకౌంట్స్‌ను నింపేశాయి. గూగుల్‌ ఇండియా, అమూల్‌, ఐక్యరాజ్యసమితి లాంటి సంస్థలు కొన్ని ఎమోజీలను తమ ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఎయిర్‌ హగ్‌ ఎమోజీని గూగుల్‌ ఇండియా పోస్ట్‌ చేయగా, మహిళల పట్ల చూపుతున్న వివక్షను ఐక్యరాజ్యసమితి మహిళ విభాగం ఎమోజీల రూపంలో చూపింది. అమూల్‌ ఎమోజీని ఈట్‌మోర్‌జీగా మార్చి  పోస్ట్‌ చేసింది. ఇలా ఒక్కొక్కరు ఒక్కొలా ఎమోజీ డేని సెలబ్రెట్‌ చేసుకుంటున్నారు. 

చదవండి: ఈ ఎమోజీలను వాడొద్దు.. ఎందుకంటే..?

మరిన్ని వార్తలు