మెట్రోలో.. మనమెక్కడ?

28 Nov, 2017 09:04 IST|Sakshi

మెట్రో.. హైదరాబాద్‌ కలలు రైలు. వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రజా రవాణా కోసం ఏర్పడ్డ మెట్రో.. నేటి నుంచి పట్టాలపై పరుగులు తీయనుంది. దేశంలో ఇప్పటికే ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరు, గుర్‌గావ్‌, జైపూర్‌, చెన్నై పట్టణాల్లో మెట్రో రైలు పరుగులు తీస్తోంది. మన దేశంలోకి మెట్రో సేవలు అలస్యంగా అడుగుపెట్టినా.. అత్యంత ఆధునికతో అందుబాటులోకి వచ్చాయి. ఇంకా చెప్పాలంటూ హైదరాబాద్‌ మెట్రో.. ఆధునిక సాంకేతికతకు నిలువుటద్దం.

ప్రపంచవ్యాప్తంగా ..!
ర్యాపిడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌గా పేర్కొనే మెట్రో.. సేవలు నేడు ప్రపంచవ్యాప్తంగా 55 దేశాల్లో 157 నగరాల్లో ప్రజలకు సేవలందిస్తున్నాయి. ఇందులో లండన్‌ మెట్రోను.. ప్రపంచంలోనే మొట్టమొదటి అండర్‌గ్రౌండ్‌ మెట్రోగా ఖ్యాతి దక్కించుకుంది. ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన మెట్రోగా చైనాలోని షాంఘై మెట్రో గుర్తింపు పొందింది. ఇక ప్రపంచంలోనే అత్యంత బిజీ మెట్రో సబ్‌వేలుగా బీజింగ్‌, న్యూయార్క్‌ సబ్‌వేలు నిలిచాయి. ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ను నేడు మెట్రోగా వ్యహరిస్తున్నారు.

మెట్రో గణాంకాలు
ప్రపంచవ్యాప్తంగా మెట్రో లైన్లు... 549
మొత్తం స్టేషన్లు... 9,200
మొత్తం కిలోమీటర్లు.. 11,300
ప్రయాణికుల సామర్థ్యం... రోజుకు 160 మిలియన్లు (మొత్తం బంగ్లాదేశ్‌ జనాభాకు సమానం)

భారత్‌లో మెట్రో
మన దేశంలో ప్రస్తుతం ఏడు నగరాల్లో మెట్రో పరుగులు తీస్తోంది. ప్రస్తుతం దేశంలో పొడవైన మెట్రోగా ఢిల్లీ నిలిస్తే.. చివరిస్థానంలో చెన్నై మెట్రో నిలిచింది. గుర్గావ్‌ మెట్రో దేశంలో మొట్టమొదటి పబ్లిక్‌ ప్రైవేట్‌ మెట్రోగా గుర్తింపు పొందింది.

అంకెల్లో మెట్రోలు

మెట్రో         దూరం (కి.మీ)    స్టేషన్లు    లైన్లు    సామర్థ్యం
ఢిల్లీ           213        160    6    2.60 మిలియన్లు
కోల్‌కతా మెట్రో    28.14        24    1    0.65 మి
ముంబై మెట్రొ    11.40        12    1    0.12 మి
బెంగళూరు మెట్రో    25.50        25    2    0.05 మి
గుర్‌గావ్‌ మెట్రో    5.50        6    1    0.03 మి
జైపూర్‌ మెట్రో    9.63        9    1    0.2 మి
చెన్నై మెట్రో    10        7    1    0.02 మి

మరిన్ని వార్తలు