అవి.. ఎప్పుడూ, ఎక్కడా వాడకూడదు!

5 May, 2016 19:05 IST|Sakshi
అవి.. ఎప్పుడూ, ఎక్కడా వాడకూడదు!

న్యూఢిల్లీః కంప్యూటర్ల కాలంలో పాస్ వర్డ్స్ కు ప్రాధాన్యత భారీ పెరిగిపోయింది. ఎటువంటి వ్యక్తిగత వివరాలను భద్రపరుచుకోవాలన్నా అందుకు పాస్ వర్డ్స్ ప్రధాన పాత్ర వహిస్తాయి. అందుకే పెట్టుకున్న పాస్ వర్డ్ ఎవ్వరికీ తెలియకుండా కూడ చూసుకోవాలి. బ్యాంకులు, ఇతర వ్యాపార సంస్థలు పాస్ వర్డ్ వివరాలు ఎవ్వరికీ షేర్ చేయొద్దంటూ ఒక్కోసారి హెచ్చరికలు కూడ జారీ చేస్తుంటాయి. అంతటి ప్రాధాన్యత ఉన్న పాస్ వర్డ్స్ కు కూడ ఒక 'డే' ఉందని మీకు తెలుసా?  'పాస్ వర్డ్స్ డే' సందర్భంగా సైబర్ భద్రతా నిపుణులు కొన్ని జాగ్రత్తలు సూచిస్తున్నారు.

వ్యక్తిగత జీవితంలోనూ, డిజిటల్ జీవితంలోనూ కూడ ముఖ్యమైన విషయాలు కొన్ని పాటించాల్సిన అవసరం ఉంటుంది. భద్రతా, గోప్యతా వంటి విషయాలు పాటించడాన్ని అశ్రద్ధ చేస్తే ఒక్కోసారి ఎన్నో నష్టాలు చవి చూడాల్సి వస్తుంది. ముఖ్యంగా పాస్ వర్డ్స్ విషయంలో అటువంటి భద్రత, గోప్యత ఎంతో అవసరం. కానీ ఈ విషయంలో చాలా మంది విఫలం అవుతుంటారు. సులభంగా గుర్తుండేదో, వరుస నెంబర్లో, స్వంత పేర్లనో వాడేస్తుంటారు. కానీ పాస్ వర్డ్ క్రియేట్ చేసుకునేవారు ముందుగా కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెప్తున్నారు. పాస్ వర్డ్ కొత్తగా పెట్టుకునేవారు  పదాలు, అక్షరాల్లో తప్పనిసరిగా కొన్ని సంఖ్యలను కలసి ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా సొంత పేర్లు, పుట్టిన తేదీలు, ఇంతకు ముందు వాడిన పేర్లు, కారు నెంబర్లు వంటివి ఎట్టిపరిస్థితుల్లోనూ పాస్ వర్డ్స్ గా వాడొద్దని సలహా ఇస్తున్నారు. అంతేకాదు ఇతరులు ఊహించగలిగే పదాలు, సంఖ్యలను కూడ వాడకూడదు. 123456 వంటి పాస్ వర్డ్స్ సైబర్ నేరగాళ్ళు ఈజీగా ఊహించగల్గుతారని, సామాజిక మాధ్యమాల ఆధారంగా వాటిని చోరాసురులు టార్గెట్ చేస్తారని చెప్తున్నారు. పాస్ వర్డ్స్ లో కొన్నిసార్లు వారిచ్చే ప్రశ్నలకు సులభమైన సమాధానాలు ఇవ్వడంతో కూడ వ్యక్తిగత డేటాను చోరీ చేయగల్గుతారని భద్రతా సంస్థలు చెప్తున్నాయి.  అంతేకాక వెబ్ ప్రపంచంలో ఏదో ఒక ఆధారంతో ఆయా వివరాలను తెలుసుకోగల్గుతారని, తరచుగా పాస్ వర్డ్స్ మార్చుకుంటుండటం వల్ల హ్యాక్ చేసే అవకాశం ఉండదని చెప్తున్నారు. ముఖ్యంగా ఒకే పాస్ వర్డ్ ను అన్ని వెబ్ సైట్లలో వాడటం మానుకోవాలని చెప్తున్నారు.

హ్యాకర్స్ , సైబర్ క్రమినల్స్ ఆట కట్టించాలంటే ఎవరికి వారు పాస్ వర్డ్స్ విషయంలో శ్రద్ధతోపాటు, జాగ్రత్తలు వహించాలని సైబర్ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడంవల్ల  సైబర్ నేరాలను అరికట్టేందుకు అధికారులకు సహకరించినవారవుతారని అంటున్నారు. ముఖ్యంగా ప్రపంచంలో వాడేందుకు పనికిరాని, వాడ కూడని 25 చెత్త పాస్ వర్డ్స్ జాబితాను కూడ.. పాస్ వర్డ్స్ డే
సందర్భంగా సైబర్ భద్రతా నిపుణులు వెల్లడించారు. అవేమిటో చూద్దాం...

మరిన్ని వార్తలు