ఇకపై ఆన్‌లైన్‌లో బీఎస్సీ డేటా సైన్స్‌ కోర్సు

30 Jun, 2020 19:39 IST|Sakshi

చెన్నై: ప్రపంచ వ్యాప్తంగా డేటా సైన్స్‌కు రోజు రోజుకు ప్రాధాన్యత పెరుగుతుతోంది. 2026 నాటికి ఈ రంగంలో దాదాపు  11.5 మిలియన్ల ఉద్యోగాలు లభ్యమవుతాయని అంచన. దానిని దృష్టిలో పెట్టుకొని డేటాసైన్స్‌లో ఆన్‌లైన్‌ ద్వారా సమగ్రమైన ఒక డిగ్రీని అందించే కార్యక్రమానికి ఐఐటీ మద్రాస్‌ శ్రీకారం చుట్టింది.  ప్రపంచంలో మొదటిసారి  ప్రోగ్రామింగ్‌ అండ్‌ డేటాసైన్స్‌లో ఆన్‌లైన్‌ బీఎస్సీకోర్సును మంగళవారం కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి రమేష్‌ పొక్రియల్‌ నిశాంక్‌ ప్రారంభించారు. ఈ ఆన్‌లైన్‌ కోర్సును ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, మద్రాస్‌ (ఐఐటీ, మద్రాస్‌) అందిస్తోంది. 12వ తరగతి పాస్‌ అయ్యి, 10వ తరగతిలో ఇంగ్లీష్‌, మ్యాథ్స్‌ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు.  (ఐఐటీ–మద్రాస్‌ నెంబర్‌ 1)

ఈ కోర్సును మూడు స్టేజ్‌లలో అందించనున్నారు. ఫౌండేషన్‌ ప్రోగ్రాం, డిప్లమా ప్రోగ్రాం, డిగ్రీ ప్రోగ్రాం. అయితే ఏ స్టేజ్‌లో కావాలన్నా కోర్సును మధ్యలో ఆపేయవచ్చు. దానికి సంబంధించిన సర్టిఫికేట్‌ను కూడా ఐఐటీ మద్రాస్‌ నుంచి పొందవచ్చు. (తాగునీటి శుద్ధికి జనుము + రాగి!)

ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు క్వాలిఫయింగ్‌ పరీక్షను  రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష అఫ్లికేషన్‌  ఫీజు రూ. 3000 ఉంటుంది. వారికి నాలుగు వారాల పాటు మ్యాథ్స్‌, ఇంగ్లీష్‌, స్టాటిస్టిక్స్‌, కంప్యూటేషనల్‌ థింకింగ్‌లో కోర్సు ఉంటుంది. వీరికి ఆన్‌లైన్లో విద్యాబోధన అందిస్తారు. వీరు ఆన్‌లైన్‌లో ఎసైన్‌మెంట్స్‌, నాలుగో వారం చివరిలో క్వాలిఫయింగ్‌ పరీక్షను  రాయాల్సి ఉంటుంది. పరిమిత సంఖ్యలో సీట్లు ఉండటంతో 50శాతం పైగా ఉత్తీర్ణత సాధించిన వారిని ఈ ఫౌండేషన్‌ కోర్సుకు అర్హులుగా ఎంపిక చేస్తారు. (ప్రపంచం భారత్‌ వైపు చూస్తోంది!)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు