'ఛీ, విన‌డానికే ద‌రిద్రంగా ఉంది'

4 Jun, 2020 16:15 IST|Sakshi

న్యూఢిల్లీ: జ‌నాలు అస్స‌లు మొహ‌మాట ప‌డ‌ని ఏకైక చోటు పానీపూరి బండి. అబ్బాయిలకు పానీపూరి ఇష్టం ఉంటుంది, కానీ అమ్మాయిలకు పానీపూరి పిచ్చి ఉంటుంది. ఎందుకంటే ఆ బండి ద‌గ్గ‌రకు ఎప్పుడూ వెళ్లే రెగ్యుల‌ర్ క‌స్ట‌మర్స్ వీళ్లు. ఇప్పుడు చెప్ప‌బోయే ఈ వార్త క‌‌చ్చితంగా పానీపూరి ప్రియుల‌కు కోపం తెప్పిస్తుంది. ఇప్ప‌టివ‌ర‌కు నెట్టింట్లో వెరైటీ వంట‌కాల పేరుతో ఎన్నో ఘోరాల‌ను చూశాం. అందులో గులాబ్‌జామూన్ పావ్ బాజీ, కుర్‌కురే మిల్క్‌షేక్‌, స్వీట్ మ్యాగీ, ఓరియో స‌మోసా, న్యూటెల్లా బిర్యానీ ఇలా పేర్లు వింటేనే గుండెలదిరే వంట‌కాల గురించి విన్నాం. (2020లో ఇవి మాత్రం ప్రయత్నించకండి)

తాజాగా భోజ‌న‌ప్రియుల‌ను బెంబేలెత్తించే మ‌రో కొత్త వంట‌కం పుట్టుకొచ్చింది. అదే "మ్యాగీ పానీపూరి". ఇది ఎలా త‌యారుచేయాలో వివ‌రిస్తూ బ‌న్నీ అనే వ్యక్తి దీనికి సంబంధించిన వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. ఇందులో పూరీలో ప‌ప్పు, పానీకి బ‌దులుగా రెడీ చేసి పెట్టిన మ్యాగీని వేసి ఉంచాడు. దీన్ని చూసి షాక్‌కు లోనైన నెటిజ‌న్లు 'ఇది హార‌ర్ చిత్రంలోని దృశ్యంలా ఉంది', 'ఇది 2020 ఏడాది క‌న్నా పెద్ద ‌ఘోరం', 'ఛీ, ఈ రెసిపీ పేరు విన‌డానికే ద‌రిద్రంగా ఉంది', 'నువ్వు ఎవ‌రో తెలీదు కాని నువ్వంటే నాకు ప‌ర‌మ‌ అస‌హ్యం' అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. (పానీపూరి తిన్న 40 మంది చిన్నారులకు అస్వస్థత)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా