బీజేపీ జాబితాలో బబిత, యోగేశ్వర్‌

30 Sep, 2019 17:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు 78 మంది అభ్యర్ధులతో కూడిన తొలి జాబితాను బీజేపీ సోమవారం విడుదల చేసింది. ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ కర్నాల్‌ అసెంబ్లీ స్ధానం నుంచి పోటీ చేయనుండగా ప్రముఖ క్రీడాకారులు బబితా పొగట్‌, యోగేశ్వర్‌ దత్‌లకు కాషాయ పార్టీ నుంచి టికెట్లు దక్కాయి. తొలి జాబితాలో 38 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు తిరిగి పోటీ చేసే అవకాశం లభించగా, ఏడుగురు ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ వెల్లడించారు. హరియాణా బీజేపీ చీఫ్‌ సుభాష్‌ బరాలా తొహన నుంచి, పొగట్‌ దరి నుంచి బరిలో నిలుస్తారు. యోగేశ్వర్‌ దత్‌కు బరోడా స్ధానం కేటాయించారు. అక్టోబర్‌ 21న హరియాణా అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, 24న ఫలితాలు వెల్లడిస్తారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేయాలి

సర్కిల్‌ గీసి.. అవగాహన కల్పించిన సీఎం

మహమ్మారి బారిన చిన్నారి..

ఈనాటి ముఖ్యాంశాలు

కరోనా కట్టడి : పోర్టబుల్‌ వెంటిలేటర్లు సిద్ధం

సినిమా

కుకింగ్‌.. క్లీనింగ్‌

రుచి...వాసన తెలియడంలేదు

పిల్లలు పస్తులు ఉండకూడదు

కరోనా దగ్గర చేసింది!

నా ఇంటిని ఆస్పత్రిగా మార్చండి

కరోనాపై వార్‌ : ప్రభాస్‌, ఎన్టీఆర్‌ భారీ విరాళం