‘అయోధ్య కేసు త్వరగా తేల్చండి’

27 Jan, 2019 20:27 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సత్వరమే పూనుకోవాలని యోగా గురు బాబా రాందేవ్‌ కోరారు. మందిర నిర్మాణానికి సుప్రీం కోర్టు లేదా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ఈ అంశంపై సర్వోన్నత న్యాయస్ధానం ఇప్పటికిప్పుడు ఎలాంటి తీర్పు ఇచ్చే పరిస్ధితి లేనందున ప్రభుత్వమే చొరవ తీసుకుని మరింత కాలయాపన చేయకుండా సమస్యను పరిష్కరించాలని కోరారు. మరోవైపు జస్టిస్‌ ఏఎ బోబ్డే అందుబాటులో లేనందున అయోధ్య కేసును ఈనెల 29న సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టడం లేదని సమాచారం.

కాగా మందిర నిర్మాణంపై ప్రజల్లో ఓపిక నశిస్తోందని, ఈ అంశాన్ని సుప్రీం కోర్టు పరిష్కరించలేకుంటే తాము 24 గంటల్లో దీనికి పరిష్కారం చూపుతామని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ శనివారం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయోధ్య కేసును తేల్చడంలో జరుగుతున్న విపరీత జాప్యంతో ప్రజల్లో ఓపిక, విశ్వాసం సన్నగిల్లుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు