సాక్షి,న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మన్‌కీబాత్ కార్యక్రమంలో యోగ ప్రాధాన్యత నొక్కి చెప్పారు. జీవనశైలి వ్యాధులతో పోరాడేందుకు యువ భారత్ యోగాను అందిపుచ్చుకోవాలని సూచించారు. మధుమేహం వంటి జీవనశైలి వ్యాధులకు యోగతో చెక్ పెట్టవచ్చన్నారు. పిల్లలను ఆరుబయట ప్రాంగణాల్లో ఆటలాడుకునేందుకు ప్రోత్సహించాలని సూచించారు. చిన్నారులే నవ్య భారత్‌కు నేతలని కొనియాడారు .
అక్టోబర్ 30, 31న సర్ధార్ వల్లబాయ్ పటేల్ జయంతోత్సవాలు, దివంగత ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతిల సందర్భంగా దివంగత నేతల సేవలను ప్రధాని ప్రస్తుతించారు. కుల, మతాల ఆధారంగా వివక్షకు చరమగీతం పాడాలన్న సర్ధార్ పటేల్ ఆకాంక్షను మనం నెరవేర్చేందుకు ప్రతినబూనాలన్నారు. ఆయన జయంతిని జాతీయ సమైక్యతా దినంగా పాటించాలని పిలుపు ఇచ్చారు.