యోగాతో లైంగిక దాడులు తగ్గుతాయి: జోషి

23 Feb, 2015 09:43 IST|Sakshi

యోగా చేయడంవల్ల దేశంలో లైంగిక దాడులు తగ్గుముఖం పడతాయని బీజేపీ ప్రముఖ నేత మురళీ మనోహర్ జోషి అన్నారు.  "సాధారణ వ్యక్తుల జీవితాల్లోకి యోగాను ఆహ్వానించడం వల్ల మనం రోజూ చూస్తున్న లైంగిక దాడులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయని చెప్పనుగానీ కచ్చితంగా తగ్గుతాయని మాత్రం చెప్పగలను. ఎందుకంటే యోగా.. స్త్రీ, పురుషల ఆలోచన విధానంలో మార్పును తీసుకొస్తుంది. భావోద్వేగాలు మారిపోతాయి.

 

ఎన్నో పనులు చేయడానికి ఈ ప్రకృతి మనకు ఈ శరీరాన్ని అందించింది.. ఆ పనుల వైపుగా మనిషి సాగిపోతాడు' అని  డిళ్లీలో యోగాపై జరిగిన ' ది లైంగర్ వే యోగా ఫర్ ది న్యూ మిలినీయం' అనే అంశంపై జరిగిన సెమినార్లో వ్యాఖ్యానించారు.  కాగా ముస్లింలు రోజూ ఐదుసార్లు యోగా చేస్తారని, వారి పవిత్ర దైవం మహ్మద్ గొప్ప యోగి అని కాస్త వివాదమయ్యే వ్యాఖ్యలు కూడా చేశారు.

>
మరిన్ని వార్తలు