'వారిని గెంటేసి జైల్లో పెట్టాలి'

7 Mar, 2016 08:58 IST|Sakshi

కోల్కతా: బీజేపీలో కొందరిని బయటకు గెంటేసి వారిని జైలులో పెట్టాలని ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ అన్నారు. ముఖ్యంగా యోగి ఆధిత్యానాథ్, సాద్వి ప్రాచి నాన్సెన్స్గా తయారయ్యారని వారిని వెంటనే పార్టీ నుంచి బయటకు పంపించాలని, కటకటాల్లో పెట్టాలన్నారు. 'బీజేపీలో కొందరు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. వారికి జాఢ్య మనస్తత్వం ఉంది. సాధ్వి, యోగిలాంటి వారిని పార్టీ నుంచి తొలగించి జైలులో పెట్టాలి' అని ఆయన అన్నారు.

కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది చెత్త విషయాలు మాట్లాడుతున్నారని అది నీచమైన పని అన్నారు. తాను ఎవరూ నీచంగా మాట్లాడినా వెనుకేసుకొచ్చేది లేదని, అలాంటివారిని విమర్శిస్తూనే ఉంటానని అన్నారు. ఈ దేశంలో సంపన్నులు, ప్రఖ్యాతి చెందిన వారే అసహనం గురించి మాట్లాడుతున్నారని, వీధిలో వెళ్లే సామాన్యుడు ఈ విషయాన్ని ఎప్పుడూ మాట్లాడడని అన్నారు. వారు రెండు పూటల తమకు భోజనం సరిపోతే చాలని అనుకుంటారని గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు