ఆదిత్యనాథ్ ధిక్కారం

11 Sep, 2014 02:28 IST|Sakshi
ఆదిత్యనాథ్ ధిక్కారం

నిషేధాన్ని ఉల్లంఘించి ఎన్నికల ప్రచారం
 లక్నో: ఎన్నికల ప్రచార సభలో పాల్గొనొద్దని ఉత్తరప్రదేశ్ పోలీసులు విధించిన నిషేధాన్ని బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ ధిక్కరించారు. బుధవారం ఆయన లక్నోలోని ఇందిరానగర్‌లో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ప్రసంగించారు. అంతకుముందు.. ఈ సభలో ప్రసంగించేందుకు ఆయనకు ఇచ్చిన అనుమతిని పోలీసులు ఉపసంహరించుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వ ఆదేశాలమేరకే దీన్నిఉపసంహరించారని ఆదిత్యనాథ్ విమర్శించారు.

నోయి డా ఉపఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టే వ్యాఖ్య లు చేశారన్న ఆరోపణలపై ఎన్నికల సంఘం ఆయనకు నోటీసు ఇవ్వడం తెలిసిందే. ప్రభుత్వ మత ఎజెండాను ఎండగట్టినందుకే తనకు నోటీసులు ఇచ్చారని ఆయన అన్నారు. అనుమతిలేకుండా ఎన్నికల సభలో పాల్గొన్నందుకు ఆదిత్యనాథ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని పోలీసులు చెప్పా రు. ‘సభ నిర్వహించడంలేదని బీజేపీ నేతలు చెప్పడంతో అనుమతి రద్దు చేశాం. అయితే వారు తిరిగి అనుమతి కోరారు. సమయాభావంతోఅనుమతివ్వలేదు’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు