తాజ్‌మహల్‌ పర్యాటక స్థలం కాదు

3 Oct, 2017 04:08 IST|Sakshi

ఉత్తరప్రదేశ్‌ పర్యాటక బుక్‌లెట్‌ నుంచి తొలగింపు  

న్యూఢిల్లీ / లక్నో: ఆధునిక ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ను ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం పర్యాటక ప్రాంతాల జాబితా నుంచి తొలగించింది. రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి, ప్రోత్సహించడానికి విడుదల చేసిన బుక్‌లెట్‌లో గంగా నదికి హారతి ఇవ్వడాన్ని ముఖచిత్రంగా ఇచ్చారు. ప్రతి ఏటా దాదాపు 60 లక్షల మంది పర్యాటకులు, ఎక్కువగా విదేశీయులు తాజ్‌మహల్‌ను సందర్శిస్తారు.

తాజ్‌మహల్‌ను యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించగా.. ప్రధాని మోదీ ‘క్లీన్‌ ఇండియా మిషన్‌’కు ఎంపిక చేసిన 10 ప్రాంతాల్లో తాజ్‌మహల్‌ చోటు దక్కించుకుంది. రామాయణం, భగవద్గీతలు మాత్రమే భారతీయ సంస్కృతికి చిహ్నాలనీ, తాజ్‌మహల్‌ ఎంతమాత్రం కాదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.  

అది వాస్తవం కాదు: యూపీ పర్యాటక బుక్‌లెట్‌ నుంచి తాజ్‌మహల్‌ను తొలగించారన్న వార్తల నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. యూపీలో రూ.370 కోట్లతో చేపడుతున్న పర్యాటక ప్రాజెక్టుల్లో ఒక్క తాజ్‌మహల్‌ కోసమే రూ.156 కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

ఖైదీలకూ ఆ హక్కు ఉంది: సుప్రీం
న్యూఢిల్లీ: నేరం రుజువై శిక్ష అనుభవిస్తున్న దోషులకు కూడా జైలు గోడలు దాటి బయటికి వెళ్లే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సామాజిక సంబంధాలు కొనసాగించేందుకు వారికి అవకాశం ఇవ్వాలని పేర్కొంది. సుదీర్ఘ కాలంగా జైలు శిక్ష అనుభవిస్తున్న వారు.. పెరోల్‌/ఫర్లాఫ్‌ కోరితే మానవీయ కోణంలో నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

మరిన్ని వార్తలు